https://oktelugu.com/

Game Changer: ‘గేమ్ చేంజర్’ సినిమాలో 10 కోట్లు పెట్టి తీసిన సాంగ్ ను ఎందుకు తీసేశారు…శంకర్ కి అసలు డబ్బుల వాల్యూ తెలియదా..?

ఇక ఈ సంక్రాంతి సీజన్ కి రావాల్సిన సినిమాల్లో గేమ్ చేంజర్ సినిమా ఈరోజు రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమా విషయంలో దర్శకుడు శంకర్ కానీ, రామ్ చరణ్ కానీ చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ చేసిన ఈ సినిమాకి భారీగా ఓపెనింగ్స్ అయితే దక్కుతున్నట్టుగా తెలుస్తోంది...

Written By:
  • Gopi
  • , Updated On : January 10, 2025 / 04:03 PM IST

    Game Changer(11)

    Follow us on

    Game Changer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నప్పటికి రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…మరి ఇప్పుడు ఆయన శంకర్ తో చేసిన గేమ్ చేంజర్ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రస్తుతం సినిమా మేకర్స్ కొంతవరకు ఇబ్బందుల్లో పడ్డట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని సంక్రాంతి బరిలో నిలిపారు. కానీ ఈ సినిమా మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు సైతం కొంతవరకు నిరుత్సాహపడుతున్నారనే చెప్పాలి. ఇక శంకర్ ఈ సినిమా కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి మరి సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ అది ఎక్కడ సెట్ అవ్వలేదు…

    ఇక ఈ సినిమాలో కేవలం సాంగ్స్ కోసమే 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇక అందులో ‘హైనా హైరానా’ అనే సాంగ్ కూడా తీసేసారు. ఎందుకంటే అది సినిమా ఫ్లో కి అడ్డు గా ఉందనే ఉద్దేశ్యం తోనే దాన్ని తీసి పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది…ఇకమొత్తానికైతే 10 కోట్లు పెట్టి భారీగా చిత్రీకరించిన ఆ సాంగ్ ని తీసేయడం అనేది కొంతమంది ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించే విషయమైనప్పటికి 10 కోట్ల రూపాయలను ఈజీగా వేస్ట్ చేసేసారు.

    సినిమా తీయడానికి ముందే ప్రణాళికలు రూపొందించుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా 10 కోట్ల రూపాయలు వేస్ట్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. దీంతో ఒక మీడియం రేంజ్ హీరోతో సినిమా కూడా చేయొచ్చు అంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం శంకర్ ను విపరీతంగా విమర్శిస్తున్నారు… మరి ఏది ఏమైనా కూడా ఒక సినిమా తీసేటప్పుడు దానికి ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పర్ఫెక్ట్ గా చేసుకొని ఉంటే ఇలాంటి ఇబ్బందులు అయితే రావని తెలుస్తోంది.

    ఇక డబ్బులు ఖర్చు పెట్టించడం కాదు ఆ డబ్బులు వసూలు చేసి చూపించినప్పుడే దర్శకుడు యొక్క గొప్పతనం అనేది బయటపడుతుంది. మరి ఈ సినిమాకి దాదాపు 500 కోట్ల వరకు బడ్జెట్ ను పెట్టారు. మరి పెట్టిన మొత్తం అయిన రికవరీ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…