https://oktelugu.com/

Siddharth: అసలు సిద్ధార్థ్ ఎందుకు ఏడ్చాడు.. కారణం ఏంటి?

హీరో సిద్దార్థ్ ప్రస్తుతం చిన్నా అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తమిళంలో చిత్తా అనే పేరుతో రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకున్న ఈ మూవీ.

Written By: , Updated On : October 4, 2023 / 12:10 PM IST
Siddharth

Siddharth

Follow us on

Siddharth: బొమ్మరిల్లు సినిమాతో తన సత్తా చాటిన సిద్దార్థ్ ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారిడిగా నిలిచాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో త్రిషతో కలిసి నటించి మరింత క్రేజ్ సంపాదించాడు ఈ హీరో. కానీ పెద్దగా హిట్ లు లేవనే చెప్పాలి. కొన్ని రోజులు అసలు సిద్ధార్థ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడా? లేదా వేరే బిజినెస్ లు, ఉద్యోగం అంటూ బిజీ అయ్యాడా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టాట్ చేసి సినిమాల్లోనే నటిస్తాను అని చెప్పకనే చెప్పేశాడు సిద్ధూ. అయితే ఈయన రీసెంట్ గా అన్ని కెమెరాలు చూస్తుండగానే ఏడ్చేశాడు ఎందుకు ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకుందాం…

హీరో సిద్దార్థ్ ప్రస్తుతం చిన్నా అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తమిళంలో చిత్తా అనే పేరుతో రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకున్న ఈ మూవీ.. అక్టోబర్ 6న తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సిద్దార్థ్ తాజాగా తెలుగులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా హీరో ఫుల్ ఎమోషనల్ అయ్యారు.

ఇక చిన్న సినిమా సెప్టెంబర్ 28 రిలీజ్ అవుతుంది అని ముందుగా ప్రకటించారు. కానీ అనుకోని రీజన్స్ వల్ల సినిమా వాయిదా పడింది. ఆ కారణాలనే సిద్దార్థ్ నేడు ఆడియన్స్ కి చెప్పుకొని బాధ పడ్డాడు. సిద్దార్థ్ తమిళ్ సినిమాలతో పరిచయం అయినప్పటికీ తెలుగు చిత్రాలతోనే స్టార్ స్టేటస్ ని అందుకున్నాడు. ఇక్కడ ఆడియన్స్ కూడా తనని ఎంతో ఓన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ నటించిన సినిమా ప్లాపులు అవ్వడం, అవకాశాలు తగ్గడంతో సిద్దార్థ్ మళ్ళీ తిరిగి కోలీవుడ్ కి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ నటించిన సినిమాలనే డబ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.

ఈక్రమంలోనే చిన్నా చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలని భావించి తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ని కలిశారట. కానీ కొందరు డిస్ట్రిబ్యూటర్స్ సిద్దార్థ్ సక్సెస్ రేట్ చూసి సినిమా కొనడానికి ఆసక్తి చూపించలేదట. దీంతో ఒకప్పుడు స్టార్ చేసిన వారు ఇప్పుడు పట్టించుకోవడం లేదా అంటూ బాధ పడ్డారు సిద్దూ. ఇటీవల కన్నడ ప్రమోషన్స్ లో కావేరి జలాల నిరసన సెగ తగిలి ప్రెస్ మీట్ మధ్యలోనే సిద్దార్థ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ విషయం కంటే.. తెలుగులో జరిగిన ఈ విషయం తనని చాలా బాధ పెట్టింది అంటూ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశారు బొమ్మరిల్లు హీరో.