Shankar : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో శంకర్ కి చాలా మంది గుర్తింపైతే ఉంది. ఇక దర్శకుడి గా ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనను స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో గత కొద్ది సంవత్సరాల నుంచి ఏ మాత్రం కేర్ తీసుకోనట్టుగా కనిపిస్తున్నాడు. అందుకే వరుసగా డిజాస్టర్ సినిమాలను చేస్తూ తన ఇమేజ్ ను పోగొట్టుకుంటున్నాడు.
ఇక ప్రస్తుతం శంకర్ సినిమాలు.ప్లాప్ అవుతున్న కూడా ఆయన సినిమాల మీద అంతో ఇంతో బజ్ అయితే ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఆయన ఇక మీదట చేసే సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఏర్పడనుంది. అయితే రీసెంట్ గా సంక్రాంతి కానుక గా గేమ్ చేంజర్ అనే సినిమా రిలీజ్ చేశాడు. ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. మరి ఈ సినిమా తో పాటుగా కలెక్షన్ల రూపంలో కూడా భారీగా ఈ సినిమాకి నష్టమైతే వాటిళ్ళబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇప్పటివరకు కేవలం 300 కోట్లకు కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టడంతో సినిమా పని అయిపోయింది అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా శంకర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమా కోసం ఐదు గంటల డ్యూరేషన్ తో కూడిన సినిమా అవుట్ పుట్ ని తీసుకొచ్చారట. రెండున్నర గంటల పాటు సినిమాను కట్ చేయాలి. కాబట్టి సినిమాలో ఉన్న చాలా మంచి సీన్స్ ను తీసేయాల్సి వచ్చిందని అందువల్లే సినిమా అనుకున్నట్టుగా స్క్రీన్ మీద ప్రజెంట్ అవ్వలేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. నిజానికి శంకర్ లాంటి ఒక సీనియర్ డైరెక్టర్ ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఆయన సినిమాలు తీస్తూ వస్తున్నాడు. ఏ సినిమాని ఎలా చేయాలి? ఎంత డ్యూరేషన్ లో తీయాలి అనేది ముందే తను ముందే బౌండేడ్ స్క్రిప్ట్ రాసుకొని అందులో ఈ సీను అయితే ఫైనల్ కట్ లో ఉంటుంది ఏ సీను ఉండదు అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి. దీనివల్ల సినిమా కి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రావడమే కాకుండా అనవసరంగా ప్రొడ్యూసర్ యొక్క డబ్బులు అయితే వేస్టేజ్ అవ్వకుండా ఉంటాయి. ఐదు గంటలు డ్యూరేషన్ తో సినిమా తీశారు అంటే ఆల్మోస్ట్ ఆయన రెండు సినిమాలను తీసినట్టు లెక్క….అంటే ఒక సినిమాకి పెట్టిన డబ్బులు వృధా అయిపోయాయి. కేవలం ఒక సినిమాను మాత్రమే రిలీజ్ చేశారు.
ఈ లెక్కన డబ్బులు మంచినీళ్లలా ఖర్చుపెట్టిన శంకర్ దిల్ రాజుకి భారీగా బొక్క పెట్టాడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది.సినిమా తీయడం ఇష్టం లేకపోతే సినిమా చేయకూడదు అంతే తప్ప బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా అప్పటికప్పుడు సినిమా సీన్స్ ను మార్చేస్తూ రైటర్లను పెట్టుకొని ఏ రైటరు ఏ వెర్షన్ అయితే బాగా రాస్తాడో దాన్ని తీసుకుంటూ వెళ్తే భారీగా నష్టం రాకుండా ఎలా ఉంటుంది.
లిమిటెడ్ బడ్జెట్ లో చేయాల్సిన సినిమాని వేస్టేజ్ లో రూపంలో భారీగా ఖర్చు పెట్టించాడు. నిజానికి శంకర్ లాంటి దర్శకుడు ఇలా చేస్తున్నాడు అనే విషయం మీద సర్వత్ర అందరిలో ఆయన మీద నెగిటివిటీ అయితే పెరుగుతుంది. ఇక 100 కోట్లలో తీయాల్సిన సినిమా కోసం 450 కోట్లు పెట్టడం అనేది శాడిజం అవుతుంది తప్ప క్రియేటివిటీ అవ్వదు.
ఇక 20 కోట్లు పెట్టి తీసిన ‘నానా హైరానా’ సాంగ్ ని ఫైనల్ కట్ లో ఉంచలేదు. అలాంటప్పుడు ఆ సాంగ్ ను తీయడం… ముందుగానే సినిమాకు సంబంధించిన సీన్స్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ లోనే పూర్తి చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అంటూ సగటు ప్రేక్షకులు కూడా శంకర్ కు సలహాలు ఇస్తున్నారు….