https://oktelugu.com/

Nagarjuna : అన్నపూర్ణ స్టూడియో స్థాపించి అప్పుడే 50 సంవత్సరాలు పూర్తయిందా..? నాగార్జున వీడియో వైరల్…

అక్కినేని నాగేశ్వరరావు తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం మద్రాస్ నగరం నుంచి హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోని స్థాపించాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయన అప్పుడు నిర్మించిన స్టూడియో అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా రంగంలో కీలక పాత్ర వహిస్తూ వస్తుందనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : January 15, 2025 / 01:21 PM IST

    Nagarjuna

    Follow us on

    Nagarjuna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు అంటే ప్రేక్షకులందరికి అమితమైన గౌరవంతో పాటు చాలామంది అతనికి వీరాభిమానులుగా ఉన్నారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం మద్రాసు నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది మనకు సపరేట్ ఉండాలి. తెలుగు వాళ్ళకి ఒక ఐడెంటిటి కావాలనే ఉద్దేశ్యం తో ఆయన వచ్చి ఇక్కడే ఉంటూ అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు. అయితే ఈ స్టూడియోను నిర్మించి 50 సంవత్సరాలు అవుతున్న నేపధ్యం లో నాగేశ్వర రావు కొడుకు అయిన నాగార్జున స్టూడియో కి సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక వీడియోనైతే రిలీజ్ చేశాడు. ఇక 1975 వ సంవత్సరంలో స్టూడియో కి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్నపూర్ణ స్టూడియో అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఏ హీరో అయినా టెక్నీషియన్ అయిన దర్శకుడైన ఈ అన్నపూర్ణ స్టూడియో నుంచే తన కెరియర్ ని మొదలు పెడుతూ ఉంటారు. నిజానికి నాగార్జున కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఇక నాగార్జున స్టూడియో మొత్తం తిరుగుతూ అన్నపూర్ణ స్టూడియో కి ఆ పేరు పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ అయిన అన్నపూర్ణమ్మ గారి పేరుని ఈ స్టూడియో కి పెట్టారంటు నాగార్జున తెలియజేశాడు. అలాగే నాగేశ్వర రావు సక్సెస్ వెనుక కూడా నాగార్జున వాళ్ళ అమ్మ అయిన అన్నపూర్ణమ్మ ఉంది అంటూ ఆయన తెలియజేయడం విశేషం…

    మరి ఏది ఏమైనా కూడా అన్నపూర్ణ స్టూడియోని 1976లో ఓపెన్ సంక్రాంతి రోజున ఓపెన్ చేయడం వల్ల ప్రతి సంక్రాంతికి అన్నపూర్ణ స్టూడియోలో పనిచేస్తున్న సిబ్బందితో కలిసి టిఫిన్ చేయడం అనేది అప్పటినుంచి ఇప్పటివరకు ఆనవాయితీగా వస్తుంది.

    ఇక మొదట నుంచి కూడా నాగేశ్వరరావు తన స్టూడియోలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యులుగా భావించేవారు. అందువల్లే ఇలాంటి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి తమ కుటుంబ సభ్యులతో ఒక్క రోజైన గడపాలనే ఉద్దేశ్యంతో ఆయన అన్నపూర్ణ స్టూడియో ను స్థాపించిన రోజు అయిన సంక్రాంతి రోజు స్టూడియోలో ఉన్న మెంబర్స్ అందరితో గడుపుతూ ఉంటాడు.

    ఇక ఇది అప్పటినుంచి ఇప్పటివరకు నాగార్జున కొనసాగిస్తూ రావడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా అన్నపూర్ణ స్టూడియో అనేది ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ గా మారిపోయింది. ఇక వాళ్లనే కాకుండా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు షూటింగులను చూడడానికి కూడా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి చూస్తూ ఉంటారు…