https://oktelugu.com/

Rajendra Prasad : ఎస్వీ కృష్ణారెడ్డి ని టార్గెట్ చేసిన రాజేంద్ర ప్రసాద్ ఎందుకు అంతలా హింసించాడు..?

ఇక ఇప్పుడున్న జనరేషన్ లో ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి డైరెక్టర్ మరొకరు లేరనేది. వాస్తవం...అప్పట్లో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆయా సినిమాల్లో చేసిన హీరో హీరోయిన్లకు మంచి గుర్తింపు వచ్చేది...

Written By:
  • Gopi
  • , Updated On : August 4, 2024 / 09:34 AM IST
    Follow us on

    Rajendra Prasad : ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన స్టార్ హీరో రాజేంద్రప్రసాద్…ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే కామెడీని కోరుకునే ప్రతి ఒక్క అభిమాని కూడా ఆయన సినిమా కోసం విపరీతంగా ఎదురుచూసేవారు. ఇక ఆ క్రమంలోనే ఆయన ఎన్నో సూపర్ సక్సెస్ లను అందుకొని ఇండస్ట్రీలో ఉన్న అభిమానులందరిలో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఆయన తన ఎంటైర్ కెరియర్ లో రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, ఆ ఒక్కటి అడక్కు, ఏప్రిల్ ఒకటి విడుదల, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం లాంటి ఎన్నో కామెడీ సినిమాలు చేసిసూపర్ సక్సెస్ లను అందుకున్నాడం ఇక ముఖ్యంగా ఆయన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి హీరో హీరోయిన్లకు ఫాదర్ గా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు…

    ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రాజేంద్ర ప్రసాద్, ఎస్ వి కృష్ణారెడ్డి కాంబినేషన్ లో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు లాంటి రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. ఇక ఆతర్వాత ఏదైనాప్పటికీ మరోసారి రాజేంద్రప్రసాద్ ని తన సినిమాల్లో రిపీట్ చేయలేదు. కారణం ఏంటి అంటే మాయలోడు సినిమా సమయంలో ఎస్వీ కృష్ణారెడ్డి ని రాజేంద్ర ప్రసాద్ విపరీతంగా ఇబ్బంది పెట్టాడట. ఒక పని చేయమంటే నేను అది చేయను నా ఇష్టం అంటూ వాదించే వాడట.

    ఇక చివరికి డబ్బింగ్ చెప్పడానికి కూడా రమ్మంటే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వచ్చి చెబుతాను అంటూ ఒక డిఫరెంట్ యాంగిల్ లో మాట్లాడేవాడు అంటూ ఎస్ వి కృష్ణారెడ్డి కొన్ని రోజుల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక మొత్తానికైతే రాజేంద్రప్రసాద్ లో కూడా అలాంటి ఒక మెంటాలిటీ ఉందా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. మాటలు ప్రతి ఒక్కరిని ఇక మొత్తానికైతే రాజేంద్రప్రసాద్ డైరెక్షన్ లో చేసిన మాయలోడు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలకు మంచి గుర్తింపు రావడమే కాకుండా స్టార్ హీరోగా కూడా చాలా కాలం పాటు గుర్తిందిపోవడం లో ఈ రెండు సినిమాలు చాలా కీలకపాత్ర వహిస్తాయన చెప్పాలి.

    ఇక అందుకే రాజేంద్ర ప్రసాద్ ఎస్ వి కృష్ణారెడ్డి మాయలోడు సినిమా తర్వాత వరుసగా జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి మీడియం రేంజ్ హీరోలను పెట్టుకొని సినిమాలు చేశాడు. కానీ రాజేంద్రప్రసాద్ ను మాత్రం మళ్లీ రిపీట్ చేయలేదు. ఇక దానివల్ల రాజేంద్ర ప్రసాద్ చాలా భారీగా నష్టపోయాడు. ఎస్వీ కృష్ణారెడ్డి అప్పట్లో స్టార్ డైరెక్టర్ గుర్తింపు పొందడమే కాకుండా ఆయన సినిమాలతో ప్రతి హీరోకి మంచి సక్సెస్ అయితే దక్కేది. ఇక ఈ విషయంలో రాజేంద్ర ప్రసాద్ కొంత వరకు అన్ లక్కీ పర్సన్ అనే చెప్పాలి.

    ఇక మొత్తానికైతే కృష్ణారెడ్డి తన సినిమాకి కథ స్క్రీన్ ప్లే అందిస్తూ డైరెక్షన్ కూడా చేసేవాడు. ఇక అందులో భాగంగానే మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా తనే వ్యవహరించడం విశేషం. కృష్ణారెడ్డి గారు చేసిన సినిమాలు ప్రతిసారి కూడా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా తనకు ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి… ఇక కే రాఘవేంద్రరావు లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఆయన చేసే ఒక సినిమాకి ఎస్ వి కృష్ణారెడ్డి ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని అనుకున్నాడట…