Nagarjuna- Lakshmi: అక్కినేని నాగేశ్వర రావు కొడుకు గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తన కెరియర్ లో చాలా మంచి సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు.మొదట్లో ఈయన హీరో గా పనికి రాడు అని చాలా మంది విమర్శించినా కూడా తన టాలెంట్ ఏంటో ఇండస్ట్రీ కి చూపించాలి అని చాలా రకాలు గా ప్రయత్నాలు చేసి మొత్తానికైతే శివ అనే సినిమాతో నాగార్జున ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారి గా షేక్ చేసాడు. ఈయన తీసిన ఈ ఒక్క సినిమా ఈయన పేరు ని టాప్ హీరో ల లిస్ట్ లో నిలిచేలా చేసింది.
ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున అన్ని జానర్స్ లో సినిమాలు చేస్తూ చాలా మంచి విజయాలను అందుకున్నాడు. నిజానికి ఈయన అప్పట్లో గీతాంజలి, జానకి రాముడు, నిన్నే పెళ్లాడుతా,అన్నమయ్య లాంటి సినిమాలు చేసి ఆయన మార్క్ స్టామినా ఏంటో అందరికి తెలిసేలా చేసాడు.అయితే నాగార్జున ఇండస్ట్రీ కి రాకముందే డాక్టర్ డి రామానాయుడు కూతురు సురేష్ బాబు, వెంకటేష్ ల చెల్లెలు అయిన లక్ష్మి ని 1984 ఫిబ్రవరి లో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ పెళ్లి నాగార్జునకి ఇష్టం లేదు కానీ వాళ్ళ నాన్న ఫోర్స్ తో ఈ పెళ్లి చేసుకున్నాడు. దాంతో వీళ్ళకి 1986 లో నాగ చైతన్య జన్మించాడు.
ఇక నాగార్జున తో అగ్ని పుత్రుడు,మురళి కృష్ణుడు లాంటి సినిమాలు చేసిన రజిని తో ప్రేమ వ్యవహారం పెట్టుకొని ఆమె తో చాలా రోజులపాటు ప్రేమ వ్యవహారం నడిపిన తర్వాత ఆ విషయం రామానాయుడు కి తెలిసి ఆమె కి వార్నింగ్ కూడా ఇచ్చాడు దాంతో ఆమె నాగార్జునతో సినిమా లు చేయడం మానేసింది.ఇలా నాగార్జున తన తో సినిమా చేసిన ప్రతి హీరోయిన్ తో ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలవడం తో నాగార్జున బిహేవియర్ నచ్చని లక్ష్మి ఇంట్లో పెద్ద వాళ్ళు ఎంతలా చెప్పిన వినకుండా నాగార్జున నుంచి విడాకులు తీసుకుంది.ఇక ఆయనతో పాటు అప్పటికే శివ, నిర్ణయం లాంటి సినిమాలు తీసిన అమల తో అప్పటికే మంచి రిలేషన్ లో ఉన్న నాగార్జున అటు లక్ష్మి గారు విడాకులు ఇవ్వగానే అమలాని పెళ్లి చేసుకున్నాడు. ఇక వీళ్ళకి అఖిల్ జన్మించాడు.అయితే నాగార్జున లక్ష్మికి పుట్టిన నాగ చైతన్య మాత్రం పెద్దవాడు అయ్యేదాకా తల్లి దగ్గరే ఉండాలి అని కోర్ట్ చెప్పడం తో నాగ చైతన్య తన తల్లి అయిన లక్ష్మి దగ్గరే 19 సంవత్సరాలు వచ్చేదాకా ఉన్నాడు.ఇక లక్ష్మి అమెరికా లో ఉంటూ బిజినెస్ లు చూసుకునేది తనతో పాటే నాగ చైతన్య కూడా అమెరికా లో ఉండేవాడు…
ఇలా నాగార్జున కి లక్మి కి విడాకులు అయ్యాయి…ఇక ప్రస్తుతం నాగ చైత్యేన కూడా జోష్ సినిమాతో ఇండస్ట్రీ కి హీరో గా ఎంట్రీ ఇచ్చి మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక అమల కొడుకు అయిన అఖిల్ కూడా చాలా వరకు ఇండస్ట్రీ లో మంచి సినిమాలు చేస్తూన్నప్పటికీ ఆయనకి సక్సెస్ లు మాత్రం ఎక్కువగా రావడం లేదు. చూడాలి మరి అక్కినేని మూడోవ తరం హీరో ల్లో ఎవరు వాళ్ళ ఫామిలీ నేమ్ ని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారో…