https://oktelugu.com/

Sankranti Movies: సినిమాల మధ్య నెలకొన్న పోటి… సంక్రాంతి బరిలో నిలిచేదేవరు..?

నాగార్జున నా సామిరంగా అలాగే విజయ్ దేవరకొండ VD 13 , శివకార్తికేయన్ అయాలన్,అలాగే వెంకటేష్ శైలేష్ కోలన్ కాంబో లో వస్తున్న సైందవ్ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అని అనుకున్నప్పటికీ డిసెంబర్ లో సలార్ సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : September 28, 2023 / 02:07 PM IST

    Sankranti Movies

    Follow us on

    Sankranti Movies: సినిమా ఇండస్ట్రీ లో సినిమాని తీయడమే కాదు దాన్ని కరెక్ట్ టైం లో రిలీజ్ చేసి సక్సెస్ అందుకోవడం కూడా చాలా ముఖ్యం…అయితే అందరు మేకర్స్ కూడా ఈ స్ట్రాటజీని ఫాలో అవుతూ ప్రతి సినిమాని ఒక ఫెస్టివల్ సీజన్ టైం లో రిలీజ్ చేస్తూ మంచి విజయాలను అందుకోవడంలో చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటారు.అయితే మన తెలుగు వాళ్ళు అందరు కూడా ఎన్ని పనులు ఉన్న పండగ రోజు మాత్రం అందరు కలిసి ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు.

    అలాగే ఇక అందరు కలిసి కామన్ గా చేసే పని ఏంటి అంటే సినిమాలు చూడటం అందుకే పండగ టైం లో చాలా మంది ప్రొడ్యూసర్లు సినిమాల రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటారు.మన తెలుగు రాష్ట్రాల్లో దసరా, సంక్రాంతి రెండు పండగలు కూడా చాలా పెద్ద పండగలు కాబట్టి ఈ రెండు పండగల సమయం లో చాలా సినిమాలని రిలీజ్ చేసి పెద్ద సక్సెస్ కొట్టాలని మేకర్స్ చూస్తూ ఉంటారు…ఇక దసరా సీజన్ కి ఆల్రెడీ బాలయ్య భగవంత్ కేసరి తో వస్తుండగా రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో సందడి చేయడానికి వస్తున్నారు.ఇక ఈ రెండు సినిమాల నుంచి వచ్చిన టీజర్స్ చాలా అద్భుతం గా ఉండటం తో ఈ రెండు సినిమాల మీద కూడా జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల మీద చాలా ఆసక్తి నెలకొంది.

    ఎందుకంటే ఇప్పటికే సంక్రాంతి బరి లో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో లో వస్తున్నా గుంటూరు కారం సినిమా ఉండగా, ఇక ఇప్పుడు రవితేజ హీరో గా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్నా ఈగల్ సినిమా కూడా జనవరి 13 న వస్తుందంటూ రీసెంట్ గా ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ అఫిషియల్ అకౌంట్ నుంచి ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు అందులో మొండోడు పండగని జనవరి13 న తీసుకువస్తున్నాడు అంటూ ఉంది. అయితే సంక్రాంతి బరి లో ఇప్పటికే రిలీజ్ చేయడానికి రెడీ గా ఉన్న సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…నాగార్జున నా సామిరంగా అలాగే విజయ్ దేవరకొండ VD 13 , శివకార్తికేయన్ అయాలన్,అలాగే వెంకటేష్ శైలేష్ కోలన్ కాంబో లో వస్తున్న సైందవ్ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అని అనుకున్నప్పటికీ డిసెంబర్ లో సలార్ సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

    ఇక ఇవన్నీ ఒకెత్తు అయితే ఇప్పటికే ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్నా కల్కి 2898 AD సినిమా కూడా సంక్రాంతి కి వస్తుంది అని మేకర్స్ చెప్పినప్పటికీ అది కష్టం అనే అంటున్నారు. ఎందుకంటే డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు ప్రభాస్ సలార్ సినిమా వస్తుంటే దానికి రెండు వారాల గ్యాప్ లో కల్కి సినిమా ని రిలీజ్ చేయడం అంటే కష్టమే అని అంటున్నారు.అయితే ఈ సినిమాలు అన్ని కూడా సంక్రాంతి కి వస్తాయి అని చెప్పినప్పటికీ ఇంకా డేట్స్ ఏం అనౌన్స్ చేయలేదు దాంతో ఇప్పుడు ఇన్ని సినిమాలు ఒకేసారి వస్తే థియేటర్స్ దొరకవు కాబట్టి దింట్లో నుంచి కొన్ని సినిమాలు వెనక్కి వెళ్లిపోయే అవకాశం అయితే ఉంది…