Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవల్లో ముందుకు తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఎవరికీ దక్కనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ప్రస్తుతం ఆయన ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో బాహుబలి మూవీ 2 పార్టీలను కలిపి రిలీజ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి క్రేజ్ క్రియేట్ అవ్వబోతోంది అనేది తెలియాల్సి ఉంది… ఇక బాహుబలి ది ఎపిక్ సినిమా రీ రిలీజ్ ని పురస్కరించుకొని రాజమౌళి ప్రభాస్ రానాలతో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో బాహుబలి మొదటి పార్ట్ ఎండింగ్ లో బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ మొదటి పార్ట్ ను ఆ పాయింట్ తో ఎండ్ చేయమని తనకు కీరవాణి చెప్పాడని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. బాహుబలి మొదటి పార్ట్ లో సుదీప్ కట్టప్ప తో చిన్న కత్తి యుద్ధం చేస్తాడు. అప్పుడు కట్టప్ప చేతిలో సుదీప్ ఓడిపోతాడు. దాంతో సుదీప్ కట్టప్ప ను చాలా గొప్ప వీరుడు అంటూ పొగుడుతూ ఉంటాడు. కానీ కట్టప్ప మాత్రం నాకంటే గొప్ప వీరుడు ఉన్నాడు అని సుదీప్ కి చెబుతాడు.
Also Read: చిరంజీవి తో కలిసి నటించడం పై ప్రభాస్ హీరోయిన్ హాట్ కామెంట్స్..మండిపడుతున్న ఫ్యాన్స్!
అలాంటి వీరుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అని సుదీప్ అడిగినప్పుడు అతను లేడు చనిపోయాడు అని చెప్పగా అంతటి వీరుడిని ఎవరు చంపారు అని అడిగితే కట్టప్ప నేనే వెన్ను పోటు పొడిచి చంపాను అని చెపుతాడు…మొత్తానికైతే కట్టప్పను బాహుబలి చంపాడు అనే సీన్ ఉంది. కానీ అది మొదటి పార్ట్ మిడిల్ లో వస్తోంది.
దానివల్ల ఇంపాక్ట్ ఏమీ ఉండదు కాబట్టి కట్టప్ప శివుడి పాత్రకి బాహుబలి గురించి ఫ్లాష్ బ్యాక్ ని చెబుతున్నప్పుడు బాహుబలిని నేనే చంపాను వెన్నుపోటు పొడిచానని చెప్పి ఆ పాయింట్ ను ఇక్కడ యాడ్ చేసి మొదటి పార్టీ ఎండింగ్లో కనక చెబితే ట్విస్ట్ అద్భుతంగా ఉంటుందని కీరవాణి చెప్పడంతో రాజమౌళికి కూడా ఆ పాయింట్ బాగా నచ్చి దానిని వాడుకున్నాడట.
ఈ విషయాన్ని రాజమౌళి ఇప్పుడు రివిల్ చేయడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొత్తానికైతే కీరవాణి గొప్ప ఐడియా ఇచ్చాడని దానివల్ల సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు రేకెత్తాయంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
#Baahubali పార్ట్ 1 లో కట్టప్ప బాహుబలిని చంపే ఎండింగ్ సీన్ ఐడియా ఎవరు ఇచ్చారంటే…#Prabhas #SSRajamouli #RanaDaggubati #BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct #Tupaki pic.twitter.com/suHQ1r1JOD
— Tupaki (@tupaki_official) October 29, 2025