Pushpa 2 : పుష్ప 2′ సినిమాతో మంచి గుర్తింపుని సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనకు ఒక సపరేట్ ఇమేజ్ ని కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఇప్పటి వరకు 1300 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.
ప్రస్తుతం పాన్ ఇండియాను షేక్ చేస్తున్న స్టార్ హీరో అల్లుఅర్జున్…ఆయన చేసిన ‘పుష్ప 2’ సినిమా పాన్ ఇండియాలో తక్కువ రోజుల్లోనే 1300 కోట్లు కలెక్షన్లను రాబట్టిన మొదటి సినిమాగా చరిత్రలో నిలిచిపోయిందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి 1300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినప్పటికి షేర్ కలెక్షన్స్ విషయంలో మాత్రం ప్రొడ్యూసర్స్ కి అన్ని పోను కేవలం 100 కోట్ల ప్రాఫిట్ మాత్రమే వస్తుంది.. ఇక ఓటిటి రైట్స్, సాటిలైట్ రైట్స్ విషయాలను పక్కన పెడితే ఇప్పటివరకు ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ లో గవర్నమెంట్ కి ట్యాక్స్ లు వాళ్ళు పెట్టిన బడ్జెట్ పోను 100 కోట్ల రూపాయలు మాత్రమే ప్రాఫిట్ లో ఉంది.. అంటే అల్లు అర్జున్ మాత్రం సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే 300 కోట్ల రూపాయలను తన రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రొడ్యూసర్స్ తో పోల్చుకుంటే అల్లు అర్జున్ కే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినట్టుగా ట్రెడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ప్రొడ్యూసర్స్ కంటే హీరోల పరిస్థితి చాలా బెటర్ గా ఉందంటూ సగటు ప్రేక్షకులు కూడా కామెంట్స్ చేస్తున్నారు… నిజానికి వందల కోట్లు పెట్టి సినిమాని తీస్తున్న ప్రొడ్యూసర్ ఒకవేళ సినిమాకి డిజాస్టర్ టాక్ వస్తే మాత్రం భారీగా నష్టపోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ మంచి సక్సెస్ సాధించినప్పటికి అతనికి కేవలం 100 నుంచి 200 కోట్ల వరకు లాభాలు మాత్రమే వస్తున్నాయి.
కానీ హీరోలు మాత్రం వందల కోట్లు రెమ్యునరేషన్స్ ను తీసుకుంటున్నారు… ఇలా చేయడం కరెక్టేనా అని కొందరు ప్రశ్నిస్తుంటే మరి కొంతమంది మాత్రం హీరోలకు ఎన్ని వందల కోట్లు ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళను చూసే ఆడియన్స్ థియేటర్ కి వస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమాకి మొదటి రెండు మూడు రోజుల వరకు సినిమా టికెట్లు ధరలు 1000 రూపాయల వరకు ఉన్నప్పటికి చాలామంది ఆ సినిమాను చూడడానికి వచ్చారు.
కారణం ఏంటంటే కేవలం అది అల్లు అర్జున్ ను చూసి మాత్రమే వచ్చారు తప్ప డైరెక్టర్ ను, ప్రొడ్యూసర్ ను చూసి కాదు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. అంటే హీరో అనేవాడు సినిమా మొత్తానికి కీలకం కాబట్టి అతనికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడంలో తప్పులేదనే ధోరణిలో మాట్లాడుతున్నారు.
ఇక మరి కొంతమంది మాత్రం ఒకవేళ సినిమాలు ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ ఉన్నదంత అమ్ముకొని ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా అంటూ ప్రొడ్యూసర్స్ క్షేమాన్ని కోరుతూ మాట్లాడుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈరోజు ఇండస్ట్రీలో జరుగుతున్న వ్యవహారం ఇదే కాబట్టి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా ఇలానే వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే మాత్రం సినిమాలు చేయకుండా ఖాళీగా కూర్చోవాల్సిందే…