https://oktelugu.com/

Dil Raju: దిల్ రాజు ఎన్టీయార్ తో చేయాల్సిన ఆ సూపర్ హిట్ సినిమాను ఆ యంగ్ హీరో తో ఎందుకు చేశాడు…

సినిమాలను చాలామంది తీస్తారు. కానీ మంచి సినిమాలను తీసే ప్రొడ్యూసర్లు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో దిల్ రాజు మొదటి స్థానంలో ఉంటాడు....

Written By:
  • Gopi
  • , Updated On : September 19, 2024 / 10:24 AM IST

    Dil Raju

    Follow us on

    Dil Raju: తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు.. దిల్ సినిమాతో నిర్మాతగా మారిన ఆయన సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకొని ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఎదురులేదనే చెప్పాలి. దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమా మీద ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉండటమే కాకుండా ఆ సినిమా తప్పకుండా సూపర్ సక్సెస్ సాధిస్తుందనే ఒక కాన్ఫిడెంట్ ని కూడా వ్యక్తం చేసేలా దిల్ రాజు ఒక బ్రాండ్ నేమ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలను చేసిన ఆయన ఎన్టీఆర్ తో చేయాల్సిన ఒక సూపర్ హిట్ సబ్జెక్ట్ ని మాత్రం వేరే యంగ్ హీరోతో చేయాల్సి వచ్చింది. నిజానికి ‘బొమ్మరిల్లు భాస్కర్’ దర్శకత్వంలో వచ్చిన ‘ బొమ్మరిల్లు ‘ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన సిద్ధార్థ ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడుని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ అలాంటిది.

    అయితే ఈ సినిమా స్టోరీని మొదటగా దిల్ రాజు ఎన్టీఆర్ కి వినిపించాడట. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా చాలా సాఫ్ట్ గా ఉందనే ఉద్దేశ్యంతో ఈ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేశాడు. ఇక దిల్ రాజు చేసేది ఏమీ లేక సిద్ధార్థ్ ను పెట్టి ఈ సినిమాని చేశాడు. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా సిద్ధార్థ కి కూడా మంచి గుర్తింపునైతే తీసుకు వచ్చింది. అలా ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాని తనే చేజేతులారా మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.

    కానీ దిల్ రాజు మాత్రం ఈ సినిమాను ఎన్టీఆర్ తో చేయాలని బలంగా అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నప్పటికి ఆ సినిమాను మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చేయలేకపోయాడు. తద్వారా సిద్దార్థ్ కి ఒక మంచి లైఫ్ దొరికిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా అప్పట్లో ఒక పెను ప్రభంజనం సృష్టించడమే కాకుండా దాదాపు మూడు నాలుగు సంవత్సరాల పాటు ఈ సినిమా మేనియా అనేది కొనసాగుతూనే వచ్చింది. ఎక్కడ చూసినా ఈ సినిమాలోని పాటలు, డైలాగులను వాడుతూ ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేసేవారు.

    ఇక ప్రేక్షకులు ఈ సినిమాని ఓన్ చేసుకున్నారని చెప్పడానికి వాటిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. మరి జూనియర్ ఎన్టీఆర్ కనక ఈ సినిమాలు చేసుంటే అటు క్లాస్, ఇటు మాస్ సినిమాలను చేస్తాడు అంటూ ఎన్టీయార్ కి ఒక మంచి గుర్తింపు అయితే వచ్చేది…కానీ ఇప్పుడు ఆయన ఏకంగా మాస్ సినిమాలో మాత్రమే చేస్తూ ముందుకు సాగుతున్నాడు…