Nara Lokesh- Unstoppable With NBK: ఎవరికేం కావాలో అడిగే సమయం వస్తుందో రాదో తెలవదు. కానీ ప్రకృతి రంగంలోకి దిగి కడిగే సమయం మాత్రం కచ్చితంగా వస్తుంది. క్యుములోనింబస్ మేఘాల సాక్షిగా ఇదే నిజం. ఓ వ్యక్తి మీద ముద్రలేసి, ఓ భావజాలానికి నిద్ర లేకుండా చేయాలన్న ప్రయత్నాలకి కూడా అలాంటి కౌంట్ డౌనే మొదలైంది. కాకపోతే, నాన్న చేస్తాడనుకున్నది మావయ్య చేశాడంతే ! తండ్రి తన కొడుకుని ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రమే అనుకుంటాడు. మామ అలా కాదు. తన అల్లుడిని మొనగాడిలా చూడాలనుకుంటాడు. సింపుల్. అందుకే ఈ అటెంప్ట్ అన్ స్టాపబుల్!

ఫ్లాష్ బ్యాక్ చూస్తే …
పనికిమాలినోళ్ల నోళ్లబడ్డ పనిమంతుడు లోకేశ్. బావున్నాడని పేరు రావాల్సిన చోట లావున్నాడని ప్రచారం జరిగింది అందుకే ! సాధించిన అచీవ్ మెంట్లను ప్రచారం చేసుకోవాల్సిన సమయంలో విచారంలో మునిగిపోవాల్సి వచ్చింది. అనక ఓటమి ఎదురొచ్చిందీ అందుకే ! యుద్ధానికి సన్నద్ధమవుతున్న సమయంలో కత్తీడాలూ వచ్చి చేరినట్టు బాలక్రిష్ణ షో అన్ స్టాపబుల్ కూడా సరిగ్గా కలిసొచ్చింది. బావ చేయనిది నేను చేస్తా, బాగు చేస్తా అన్నట్టు బాలయ్య రంగంలోకి దిగాడు. ఆ ఇంపాక్ట్ గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం !
లోకేశ్ మీద ప్రచారం వెనక పనసకాయ థియరీ ఉంది. “గొగ్గులుగొగ్గులుంది. గుచ్చుతుంది” అని ముద్ర వేస్తే ఎవరికి నచ్చుతుంది ? చూపుతో రుచి తెలియదు. ప్రచారం హోరెత్తితే వాస్తవం కనపడదు. అబద్ధమే వినపడుతుంది. అందుకే సక్సెస్ టేస్ట్ తెలియడానికి ముందే వేస్ట్ అనే ముద్ర వేయాలనుకొని నాలుగైదేళ్లు ప్రయత్నించారు. నాయకుడు కాదు కేవలం వారసుడు అని ముద్ర వేయాలన్నది ఎత్తుగడ. ఇపుడు తిప్పికొట్టే టైమ్ వచ్చింది. బాబంటే బొమ్మరిల్లు ఫాదరేమో ! ఫుల్ సాఫ్ట్. అంతా డిఫెన్స్. బాలయ్య అలా కాదుగా ! అందుకే కొందరికి ఉన్న అనుమానాలను అందరి ముందు అడిగేశాడు. అడ్డగోలు ప్రచారాలను కడిగేశాడు.
నిజానికి లోకేశ్ సాధకుడు. థింకింగ్ లో సోఫిస్టికేషన్ ఉన్న అచీవర్. 3 వేల కిలో మీటర్ల రోడ్లు వేసి, 30కి పైగా కార్పొరేట్ కంపెనీలు తెచ్చి, విశాఖను ఫైనాన్షియల్ కేపిటల్ గా తీర్చిదిద్దేందుకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ లాంటివి సిద్ధంచేసినోణ్ని నచ్చినా నచ్చకపోయినా అలాగే అనాలి. 151 మీటర్ల పొడుగు అని చెప్పుకునే అప్పుల డప్పుల గాళ్లని చూశాకైనా చెప్పకపోతే ఎలా మాస్టారూ ! అందుకే బాలయ్యకి బలమైన లాజిక్ ఉంది. ప్లాట్ ఫామ్ కుదిరింది. బొమ్మ అదిరింది.

లోకేష్ ని అడిగాడు బాలయ్య. ఫోటో చూపించాడు. అసెంబ్లీ వరకూ కుదిపేసింది, కథేంటి అంటే లోకేష్ చెప్పాడు. తాడి చెట్టు కింద పాలు తాగిన సామెత గుర్తొచ్చింది. నిజాలు ఎప్పుడూ అలాగే ఉంటాయ్. బాలయ్య ఏం అడిగాడో, ఆ ఫోటోల గురించి ఏం చెప్పాడో అన్ స్టాపబుల్ సీజన్ 2 ఇనాగురల్ ఎపిసోడ్ లోనే చూడాలి. లేకేష్ మాట్లాడుతుప్పుడు చంద్రబాబు ముఖంలో హావభావాలే చెబుతాయ్ ఆ సన్నివేశంలో నిజమెంతో ! వేరే సుబూత్ అక్కర్లేదు. ఇప్పటి వరకూ లోకేశ్ మోసిన అన్ వాంటెడ్ లగేజ్ ను అన్ స్టాపబుల్ గా దించేశాడు బాలక్రిష్ణ. ఓ కుట్రతో కుతంత్రంగా పన్నిన వ్యూహాన్ని ఎంత సింపుల్ గా ఛేదించొచ్చో గ్రేస్ ఫుల్ గా చూపించాడు బాలయ్య.
ఇదంతా అభిమానంతో చెప్పడం లేదు సుమీ ! అబద్ధం ఎప్పుడూ ఆర్భాటం చేస్తుంది. నిజం ఎప్పుడూ నిబ్బరంగా ఉంటుంది. కానీ ఏది నిజమో ఏది అబద్ధమో డిటర్మైన్ చేసే మూమెంట్ అయితే రావాలి కదా ! మామ ముందు, తండ్రి పక్కన చెప్పిన మాట కన్నా కన్ఫెషన్ ఇంకేముంటుంది ? సంసారం చేసే ప్రతోడికీ నిజమేంటో అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ కి స్టిల్ హోప్ ఉందని, వాస్తవాలు – నిజాలు ఎదురొచ్చి సన్ రైజ్ ని చూపిస్తాయని నమ్మకం కలిగించాడు బాలయ్య.