NetFlix IC 814 : సినిమా వేరు.. రియాలిటీ వేరు.. సినిమాలో మనకు నచ్చిన ఏదైనా కల్పితాలను జోడించుకోవచ్చు. ఇటునుంచి అటు.. అటు నుంచి ఇటు.. ఎటైనా మార్చుకోవచ్చు. ఎలాగైనా చేయవచ్చు. కానీ రియాలిటీ వేరు చరిత్ర ఏది చెప్తుందో అదే చేయాలి తప్ప మరోటి చెప్పేందుకు ఉండదు. కానీ నిజమైన ఘటనల ఆధారంగా సినిమా చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి. ఆ కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుంటే ప్రస్తుత ‘IC 814: ద కాందహార్ హైజాక్’లా చర్చకు వస్తుంది. అనుభన్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఆరు ఎపిసోడ్లతో ప్రస్తుతం నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ లో ఉంది. ఇందులో మొన్నటి వరకు హైజాకర్ల పేర్లను ఎందుకు మార్చరని చర్చ జరిగింది. కానీ ఒక్క వారి పేర్లే కాకుండా ప్రయాణికులు, సిబ్బంది, విమాన టెక్నీషియన్ల పేర్లు మార్చడంపై తప్పుపడుతున్నారు. ఢిల్లీకి చేరుకున్న భారత విదేశీ గూఢచార సంస్థ ‘రా’ నుంచి పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ పాత్ర వరకు అన్నీ మార్చారు. టెర్రరిస్టులను మంచి వారిగా చూపించడం. వారు ప్రయాణికులకు ఎలాంటి హానీ కలిగించలేదని చిత్రీకరించడం. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా వరకు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 1999లో జరిగిన IC 814లో బంధీగా ఉండి విడుదలైన వారు చెప్పిన అనేక విషయాలు, సిరీస్ ను ప్రశ్నించేలా చేస్తున్నాయి.
IC 814 ఘటన జరిగి దాదాపు 25 సంవత్సరాలు పూర్తయ్యింది. అంటే ఇంటర్నేషనల్ సమాజం, ఇండియాకు మొత్తం హైజాకర్ల పేర్లు తెలుసు, కానీ సిరీస్ కంప్లీట్ అయి క్లైమాక్స్ టైటిల్స్ పడే వరకు కూడా వారి నిజమైన పేర్లను ప్రస్తావించకోవడంపై పెద్ద దుమారం రేగింది. హైజాకర్లు ఇస్లామిక్ టెర్రరిస్టులు అనే విషయాన్ని కప్పిపుచ్చేందుకే అభినవ్ సిన్హా ఇలా చేశారా? అన్ని అనుమానాలు కలుగుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ కు హోం మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేయడంతో సోషల్ మీడియాలో మొదలైన వివాదం ముగిసింది.
నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు డిస్ క్లైమర్ లో ఉగ్రవాదుల అసలు పేర్లను చేర్చింది. ఈ సిరీస్ వాస్తవాలను తప్పుదోవ పట్టించడం వల్ల నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ రద్దు చేసుకుంటున్నట్లు పలువురు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఎక్స్ లో #BoycottNetflix ట్రెండింగా మార్చింది.
చారిత్రాత్మ ఘట్టాలతో సిరీస్, సినిమా రూపొందించే ముందు పెద్ద కసరత్తే చేయాలి. కానీ అలా చేయకుండా ఇష్టం వచ్చినట్లు తీసి రిలీజ్ చేస్తే తర్వాతి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇండియాలో ఇది అన్నింటికంటే వేగంగా ఉంటుంది. ఐసీ 814 విషయంలో #BoycottNetflix ఎక్స్ లో ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. ఇష్టం వచ్చినట్లు తీయగలరు కానీ.. వాస్తవాలను వక్రీకరించలేరుకదా. ఉదాహరణకు భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ లెజెండ్ మిల్కా సింగ్ జీవితంపై ఒక చిత్రం రిలీజ్ చేశారు. అతను ఎలా పెరిగాడు.. ఎలా ఎదిగాడు.. లాంటి వాటిలో కొంత వరకు కల్పన ఉంటే పర్వాలేదు. కానీ అతను ఒలింపిక్స్ లో పోడియం ఫినిషింగ్ చేయడాన్ని మాత్రం అందులో చూపించలేడు.
ఐఎస్ఐ IC 814 హైజాకింగ్
ఐఎస్ఐతో సంబంధాలతో ఖాట్మండులో కార్యకలాపాలను చూపించినప్పటికీ, మొత్తం ఐసీ 814 బందీ సంక్షోభంలో పాకిస్తాన్ గూఢచారి సంస్థ పాత్ర చాలా తక్కువ అని అనుభవ్ సిన్హా తేల్చారు. IC 814 యొక్క చివరి దృశ్యాల్లో ఒకటి – కాందహార్ హైజాక్ అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హైజాకర్లకు, విడుదలైన ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇవ్వడం. ఐఎస్ఐ ఉగ్రవాదులెవరినీ ఆహ్వానించలేదని, దీన్నిబట్టి ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ లో ఐఎస్ఐ పాత్ర ఎంత చిన్నదో అర్థం అవుతోందని పేర్కొంది.
దీనిపై పలువురు అధికారులు స్పందిస్తూ..
ఇందులో ఐఎస్ఐ పాత్ర ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని అధికారులు చెప్తున్నారు. ఇది కేవలం మన ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగానే కాదు. ఆ సమయంలో ఒక ప్రముఖ పాకిస్థానీ జర్నలిస్ట్ కాందహార్ లో ఉన్నాడు. ‘ఈ మొత్తం ఆపరేషన్ ను ఐఎస్ఐ నియంత్రిస్తోందని స్పష్టమైంది.’ అని అప్పటి రా చీఫ్ ఏఎస్ దులత్ మీడియాకు తెలిపారు.
IC 814 హైజాక్ సమయంలో పాకిస్తాన్ లో భారత హైకమిషనర్ గా ఉన్న పార్థసారథి మాట్లాడుతూ సిన్హా అల్ ఖైదా, తాలిబన్ పాత్రను చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇందులో పాకిస్థాన్ ప్రమేయం ఉంది. హైజాకర్లు పాకిస్థానీయులు, హైజాకర్లు విడుదలకు డిమాండ్ చేసిన వారు పాకిస్థానీయులు. కాబట్టి అల్ ఖైదా ప్రసక్తే లేదు’ అని పార్థసారథి అన్నారు. వాస్తవానికి అల్ ఖైదాకు పాకిస్థాన్ తో హైజాక్ కు పాల్పడేంతగా సంబంధాలు లేవు.
రా ఇన్ పుట్ హెడ్ క్వార్టర్స్ కు చేరలేదు..
అనుభవ్ సిన్హా సిరీస్ లో ఖాట్మండు ‘రా’ బృందం నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం భారత విమానం హైజాక్ అయ్యే అవకాశం ఉందని ఢిల్లీలోని సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. పలువురు రా అధికారులు ఇది జరగకపోవచ్చని అనుకున్నారు.
‘క్రమం తప్పకుండా అప్డేట్స్ వస్తున్నాయనే విషయం నాన్సెన్స్. ఈ సమాచారం మరొకరికి వెళ్లి ఉండవచ్చు, కానీ అది మాకు (రా)కు రాలేదు.’ అని అప్పటి రా హెడ్ ఎఎస్ దులత్ అన్నారు. ‘నేను వ్యక్తిగతంగా గ్యారంటీ ఇవ్వగలను. అలాంటి సమాచారం ఏదీ మాకు అందలేదని సంస్థ అధిపతిగా నేను మీకు చెప్పగలను’ అని దులాత్ అన్నారు. రా మాజీ అధికారి అయిన ఆర్కే యాదవ్ కూడా 2014లో రాసిన ‘మిషన్ ఆర్ అండ్ ఏడబ్ల్యూ’ పుస్తకంలో రా ఖాట్మండు స్టేషన్ హెడ్ శశిభూషణ్ సింగ్ ఈ వైఫల్యానికి కారణమని ఆరోపించారు.
భారత రాయబార కార్యాలయంలోని ‘రా’ సీనియర్ అధికారి ఎస్బీఎస్ తో మర్కు రెండో కార్యదర్శి యువీ సింగ్ అనే జూనియర్ రా ఆపరేటర్ సమాచారం ఇచ్చారని. తన వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. విమానాన్ని పాక్ ఉగ్రవాదులు హైజాక్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ‘ఈ నివేదికను రా ప్రధాన కార్యాలయానికి ఎప్పుడూ పంపలేదు, అతను (తోమర్) క్రాస్ చెక్ చేయకుండా దానిని అణచివేశారు.’ అని యాదవ్ రాశారు.
చిత్రీకరించిన తీరు సరిగా లేదు..
IC 814 మొదటి ఎపిసోడ్ లో హైజాకర్లు గాయపడిన సిబ్బంది, ప్రయాణికుల పట్ల సానుభూతితో ఉన్నారని చూపించారు. అక్కడే సిరీస్ చూడడం ఆపేసి వారికి ఫ్రెండ్ అయిపోయాను’ అని ఎక్స్ లో ఒక యూజర్ రాశాడు.
అనుభవ్ సిన్హా హైజాకర్లను మానవతా మూర్తులుగా చూపించడం బాగా లేదని వీక్షకుల ప్రధాన ఫిర్యాదుల్లో ఒకటి.
‘IC 814 యొక్క హైజాకర్లు క్రూరమైనవారు వారిని నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో సాధారణ మనుషులుగా చూపించే ప్రయత్నం చేయడం అన్యాయం.’ అని ఎక్స్ లో ఒక సీనియర్ జర్నలిస్ట్ అన్నారు.
హైజాకర్లు క్రూరంగా వ్యవహరించారని, భయానక వాతావరణాన్ని సృష్టించారని హైజాక్ కు గురైన ఐసీ 814 చీఫ్ ఫ్లైట్ అటెండెంట్ అనిల్ శర్మ వివరించారు.
IC 814 ప్రయాణికుల్లో ఒకరైన ఇప్సీతా మీనన్ మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులను చూపించిన విధానం సరిగా లేదన్నారు. ప్రయాణికులు టెన్షన్ లో ఉన్నారన్నట్లు సిరీస్ లో కనిపించలేదు.’
మతపరమైన కోణం తప్పింది..
IC 814లో ‘డాక్టర్’ (హైజాకర్లలో ఒకరు) అందరూ మతం మారాలని బెదింపులకు పాల్పడ్డారని సిరీస్ లో మాత్రం అలాంటి విషయమే టచ్ చేయలేదని, అతను కశ్మీర్ లో ఇండియా చేస్తున్న జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడి ఇస్లాంను ప్రశంసించారు.’ అని మీనన్ అన్నారు.
‘డాక్టర్’ అనే కోడ్ నేమ్ తో వెళ్లిన షకీర్ ఐదుగురు హైజాకర్లలో అత్యంత క్రూరుడు. రూపిన్ కత్యాల్ ను హత్య చేసింది ఆయనే.
హైజాక్ కు గురైన విమానంలోని మరో ప్రయాణికురాలు పూజా కటారియా ఒక మీడియాతో మాట్లాడుతూ.. విమానం వారం పాటు తాలిబన్ల ఆధీనంలో ఉన్న కాందహార్ లో ఉన్నప్పుడు షకీర్ బందీలను మతమార్పిడి చేయడానికి ప్రయత్నించాడని చెప్పారు.
ఇస్లాం మతంలోకి మారడం గురించి ఆయన మూడు నాలుగు ప్రసంగాలు చేశారని.. హిందూ మతం కంటే ఇస్లాం గొప్పదని కటారియా అన్నారు.
అనుభవ్ సిన్హా నెట్ ప్లిక్స్ సిరీస్ హైజాకర్ల నిజమైన గుర్తింపును దాచేందుకు ప్రయత్నించడంపై పెద్ద వివాదం ప్రారంభమైనప్పటికీ, ఇది IC 814 – కాందహార్ హైజాక్ వాస్తవాలకు మొత్తం చెరిపే ప్రయత్నం చేసింది.
ఇందులో ఐఎస్ఐ పాత్ర, రా ఇంటెలిజెన్స్ ఢిల్లీ చేరుకోవడం, హైజాకర్ల అంచనా, విమానంలో ఉద్రిక్తత వంటివన్నీ అనుమానాలుగా, ప్రశ్నార్థకంగా మారాయి.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More