Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎంత హీట్ వాతావరణంలో ముందుకు దూసుకుపోనుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. సీజన్ ప్రారంభమై అప్పుడే నెల రోజులు దాటిందా అనే రేంజ్ గొడవలు జరుగుతున్నాయి. ప్రతీ చిన్న విషయానికి గొడవలు పడే కంటెస్టెంట్స్ హౌస్ లో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా యష్మీ గౌడా గురించి మనం మాట్లాడుకోవాలి. ‘నాగ భైరవి’, ‘కృష్ణ ముకుంద మురారి’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈమె, మొదటి ఎపిసోడ్ నుండి గొడవలు పడుతూనే ఉంది. బిల్డప్స్ ఎక్కువ బిజినెస్ తక్కువ అనే విధంగా ఈమె వ్యవహార శైలి ఉంటుంది. గొడవలు పెట్టుకోవడంలో ఆమె పెట్టిన శ్రద్ద టాస్కులు ఆడే విషయం లో పెట్టడం లేదు. నిఖిల్ కారణంగా ఎలాంటి కష్టం లేకుండా చీఫ్ అయిన ఆమె, నామినేషన్స్ ప్రక్రియ లో ఎంత ఓవర్ యాక్షన్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కస్టపడి టాస్కులు ఆడి చీఫ్స్ రోల్స్ ని దక్కించుకున్న నిఖిల్, నైనికా కంటే ఈమెనే ఎక్కువగా కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసేందుకు పరిగెత్తుకుంటూ వచ్చేది.
అంతే కాకుండా ప్రతీ చిన్న విషయానికి పిచ్చి పట్టిన అమ్మాయిలాగా అరవడం ఈమె అలవాటు అయిపోయింది. ఈ సీజన్ బిగ్ బాస్ ప్రారంభమై వారం గడుస్తుంది, ఈ వారం రోజులు ఆమె గొడవ పడని రోజంటూ లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది ఇలా ఉండగా ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ లో ప్రేరణ హీరోయిన్ గా, యష్మీ విలన్ గా చేసారు. హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఈమె ప్రేరణ పై సీరియల్ లో ఎలాంటి అసూయ పెట్టుకుందో, అలాంటి అసూయని ప్రదర్శిస్తుంది. నాకు ప్రేరణ అంటే అసలు ఇష్టం ఉండదు అంటూ ఆమె ముఖం మీదనే చెప్పడం ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది. ఇదే తరహా యాటిట్యూడ్ తో ఆమె ముందుకు కొనసాగితే నాలుగు వారాలు కూడా గడవకముందే హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వక తప్పదని అంటున్నారు విశ్లేషకులు. ఎంతసేపు గొడవలు పడడమే కాకుండా టాస్కులు కొద్దిగా బాగా ఆడితే బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
ఇది ఇలా ఉండగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయిన వారు బెజవాడ బేబక్క, విష్ణు ప్రియా, నాగ మణికంఠ, పృథ్వీ రాజ్, శేఖర్ బాషా ,సోనియా. విష్ణు ప్రియా, నాగ మణికంఠ భారీ ఓటింగ్ తో టాప్ 1 మరియు టాప్ 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. వీరి తర్వాత మూడవ స్థానం లో పృథ్వీ రాజ్ కొనసాగుతుండగా, నాల్గవ స్థానం లో శేఖర్ బాషా కొనసాగుతున్నాడు. అయితే ప్రస్తుతానికి వీరిలో అందరికంటే అతి తక్కువ ఓట్లతో బెజవాడ బేబక్క కొనసాగుతుంది. ఈమెనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఈ వారం ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉంటుందని అంటున్నారు.