Director Krishna Vamsi: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎందుకు హిట్ కొట్టలేకపోతున్నాడు…లోపం ఎక్కడుంది…

కృష్ణవంశీ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో ఆర్జీవీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.ఆ తర్వాత ఆయన గులాబీ అనే సినిమాతో డైరెక్టర్ గా మారారు ఈసినిమా మంచి విజయం సాధించడం తో నాగార్జున తో నిన్నేపెళ్లాడుతా అనే సినిమా కూడా చేశారు.

Written By: Gopi, Updated On : September 26, 2023 1:08 pm

Director Krishna Vamsi

Follow us on

Director Krishna Vamsi: సినిమా ఇండస్ట్రీ లో ఒక డైరెక్టర్ చెప్పే కథని బేస్ చేసుకొనే సినిమా అనేది రూపొందుతుంది. అలాంటిది ఆ డైరెక్టర్ చేసే కథ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది అనేది మన అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది ఈ విషయాన్ని గమనించక చాలా మంది డైరెక్టర్లు ప్లాప్ సినిమాలు తీస్తూ ఉంటారు. ఒక ఇయర్ లో దాదాపు గా 250 వరకు సినిమాలు వస్తే అందులో గట్టిగా ఒక 10 సినిమాలు కూడా హిట్ అవ్వడం లేదు అంటే మొత్తం మిస్టేక్ అంత కూడా డైరెక్టర్లదే…

ఎందుకంటే ఒక మంచి కథ డైరెక్టర్ చేస్తేనే అది సూపర్ సక్సెస్ అవుతుంది. అలా కాకుండా నార్మల్ కథ తో వస్తే సినిమా అనేది బోల్తా కొడుతోంది. అయితే తెలుగు లో ఉన్న డైరెక్టర్లలో ఒకప్పుడు కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ చాలా మంచి సినిమాలు తీసి తెలుగు లో క్రియేట్ డైరెక్టర్ గా గుర్తింపు కూడా పొందారు.అలాంటి డైరెక్టర్ అయిన ఆయన ఇప్పుడు కూడా సినిమాలు చేస్తున్నారు అయిన కూడా ఆయన సినిమాలు ఎందుకు ఆడటం లేదు అనేది ఇక్కడ చాలా రకాలు గా మనం చర్చించుకోవాల్సిన విషయం…

ఇక కృష్ణవంశీ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో ఆర్జీవీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.ఆ తర్వాత ఆయన గులాబీ అనే సినిమాతో డైరెక్టర్ గా మారారు ఈసినిమా మంచి విజయం సాధించడం తో నాగార్జున తో నిన్నేపెళ్లాడుతా అనే సినిమా కూడా చేశారు. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం తో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో క్రియేట్ డైరెక్టర్ అనే పదానికి జెస్టిఫికేషన్ ఇస్తూ వచ్చారు.అలాగే ఈయన గురించి అప్పట్లో ఒక న్యూస్ కూడా అందరు చెప్తూ ఉండేవారు ఏదైనా ఒక సినిమా పోస్టర్ చూస్తే అది ఏ జానర్ కి సంభందించిన సినిమా ఎలా ఉంటుంది అనేది మనం చెప్పవచ్చు.

కానీ కృష్ణవంశీ సినిమాని చూసి అసలు మనం అది ఎలాంటి సినిమా అని ఎక్స్ పెక్ట్ చేయలేము అంటూ చాలా మంది అనేవారు అలాంటి ఒక గొప్ప డైరెక్టర్ ఎందుకు సక్సెస్ ఫుల్ సినిమాలు చేయడం లేదు అంటే, ఒకప్పుడు ఆయన రాసుకున్న స్టోరీ ని స్క్రీన్ మీద ప్రెసెంట్ చేసే విధానం గాని,దానికి ట్రీట్ మెంట్ రాసిన వే అఫ్ రైటింగ్ కానీ జనాలని చాలా వరకు ఇంప్రెస్స్ చేసేవి గా ఉండేవి, కానీ ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలు అసలు ఎక్కడ కూడా రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ ఎవ్వరిని ఇంప్రెస్స్ చేయలేకపోతున్నాయి.అలాగే ఆయన పేడ్ అవుట్ అయ్యాడా అంటే అవ్వలేదు.ఆయనలో ఇంకా కూడా మంచి సినిమాలు తీసే టాలెంట్ ఉంది కానీ ఒక సినిమా ని ఈ జనరేషన్ కి తగ్గట్టు గా మలచడం లో ఆయన ఫెయిల్ అవుతున్నారు.

ఆయనకి చందమామ సినిమా తర్వాత ఒక్క హిట్ సినిమా కూడా లేదు.రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే సినిమా చేసిన కూడా అది పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు ఎందుకంటే ఆయన చేసే సినిమాలో స్టోరీ ఉంది అని ఆయన అనుకున్నాడు అది అసలు స్టోరీ నే కాదు.స్టోరీ అంటే ఎలా ఉండాలి ఒక మురారి సినిమాలా ఉండాలి, ఒక ఖడ్గం సినిమాలా ఉండాలి లేదా ఒక చందమామ సినిమాలో రెండు జంటల మధ్య చూపించే ఎమోషన్స్ ని ఏ విదంగా అయితే ఎలివేట్ చేసి చుపించారో అలా ఉండాలి.

అలా లేనప్పుడు అలాంటి పకడ్బందీ స్క్రిప్ట్ రాసుకోలేనప్పుడే ఇలాంటి గోవిందుడు అందరివాడేలే లాంటి ఒక అవుట్ డేటెడ్ స్క్రిప్ట్ తో సినిమాలు వస్తాయి…ఇప్పటికి చెప్పేది ఏంటంటే కృష్ణ వంశీ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి ఫెడ్ అవుట్ అవ్వలేదు.ఆయన ప్రేక్షకులకి సినిమాని ఆయన బౌండ్రీస్ మధ్యలోనుంచి చూపిస్తున్నారు. ఒకసారి ఆయన తన బౌండ్రీస్ ని దాటి బయటికి వచ్చి ఒక అప్డేటెడ్ కథతో సినిమా చేసి హిట్ కొట్టేంత టాలెంట్ ఇంకా ఆయనలో ఉంది అని మనం నమ్ముతున్నాం ఆయన కూడా ఆ మాటని నమ్మినప్పుడు మాత్రమే ఆయన నుంచి మళ్లీ ఒక సాలిడ్ హిట్ సినిమా వస్తుంది, లేకపోతే ఆయన నుంచి మనం హిట్ సినిమా ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే అవుతుంది. ఇప్పటికైనా కృష్ణవంశీ గారు ఒక మంచి స్టోరీ రాసి సినిమా తీసి మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం…