Shankar : ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ల సత్తా చూపిస్తూ స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే మొదటిసారి పాన్ ఇండియా సినిమాను చేసిన సౌత్ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న శంకర్ మాత్రం ప్రస్తుతం తన స్టామినాను చూపించడంలో వెనుకబడిపోతున్నాడనే చెప్పాలి… దానికి కారణం ఏంటి అంటే ఆయన దగ్గర సరైన కథ లేకపోవడమే అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో శంకర్ లాంటి డైరెక్టర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఆయన చేస్తున్న సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే ఆయనకంటు ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర వహించారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ డైరెక్టర్ గత కొన్ని సంవత్సరాల నుంచి తన మ్యాజిక్ ను రిపీట్ లేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటికి సుజాత రంగరాజన్ అనే ఒక రైటర్ ఉండేవాడు. ఆయన సినిమాకు సంబంధించిన పూర్తి అంశాలను అందులో ఇన్ క్లూడ్ చేస్తూ చాలా గొప్పగా కథ రాసేవాడు. అందువల్లే శంకర్ స్క్రిప్ట్ మీద పెద్దగా ఆలోచించేవాడు కాదు. కానీ 2008వ సంవత్సరంలో ఆయన మరణించిన తర్వాత శంకర్ కి స్క్రిప్ట్ పరంగా చాలా ఇబ్బందులైతే ఎదురవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయన ఎవరి నుంచి కథను తీసుకున్న సుజాత రంగరాజన్ రాసినట్టుగా అయితే కథ కుదరడం లేదు. దానివల్ల ఆయన చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్న ఆయన… మరొక సినిమా ఎవరితో చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కథపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
మరి ఆయనకి కథను అందించే కథ రచయితలు దొరకడం లేదా లేదంటే ఆయన ఆలోచనలను మ్యాచ్ చేస్తూ రాసే రచయితలని ఆయనే తీసుకోవడం లేదా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే వ్యక్తమవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా శంకర్ చేసే సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కాలి అంటే మాత్రం కథ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరమైతే ఉంది.
ఇక అలాగే చాలా జాగ్రత్తలను కూడా తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇక మీదట చేసే సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…