Sankranti Akumanam : అదృష్టం ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. దానిని గుర్తించి ఏ మనిషి అయినా వెంటనే ఒడిసిపట్టుకోవాలి. లేకుండా ఆ అదృష్టం వేరే మనిషి ఇంటి తలుపు తడుతుంది. ఆ తర్వాత దాని ఫలితాలు చూసి అయ్యో ఎంత మంచి అవకాశం మిస్ అయ్యాము అనుకుంటే లాభం లేదు. ఇప్పుడు ఒక సీనియర్ హీరో విషయం లో అదే జరిగింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకొని తెరకెక్కించిన ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్స్ ఇచ్చారు మన తెలుగు ఆడియన్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మొదటి రోజు 45 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వాచినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. వెంకటేష్ కి ఈ రేంజ్ వసూళ్లు వచ్చి రెండు దశాబ్దాలు అయ్యింది.
అయితే ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి ముందుగా వెంకటేష్ తో చేయాలని అనుకోలేదట. అక్కినేని నాగార్జున తో చేయాలని అనుకున్నాడట. ఈ స్టోరీ ని ముందుగా ఆయనకే వినిపించాడు. కానీ రొటీన్ గా ఉంది, ఎప్పుడో నా కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి సినిమాలు చేసేసాను, మన ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఇంతకు మించి ఉండాలి అని చెప్పి ఈ కథని రిజెక్ట్ చేశాడట. దీంతో ఈ కథ నాగార్జున నుండి వెంకటేష్ కి చేతులు మారింది. ఫలితం ఏమిటో మనమంతా చూస్తూనే ఉన్నాం. సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకోబోతున్న మొట్టమొదటి సీనియర్ హీరోగా వెంకటేష్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. ఇన్ని రోజులు వెంకటేష్ కి కనీసం పాతిక కోట్ల రూపాయిల షేర్ సినిమా కూడా లేదని సోషల్ మీడియా లో ట్రోల్స్ వినిపించేవి. ఇప్పుడు ఏకంగా ఆయన వంద కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరబోతున్నాడు.
అనిల్ రావిపూడి సినిమాలకు ఎందుకో యూత్ ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వరు. ఎందుకంటే ఆయన కామెడీ చూసేందుకు క్రింజ్ గా అనిపిస్తుందని అందరి అభిప్రాయం. కానీ ఈ సినిమాలోని కామెడీ కి అలాంటి టాక్ రాలేదు. కేవలం సన్నివేశాల సందర్భానికి తగ్గట్టుగా కామెడీ ఉందని, ఇలాంటి సబ్జెక్టు లో ఆయన మంచి సోషల్ మెసేజి కూడా అందించాడని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సబ్జెక్టు ని నాగార్జున చేసి ఉంటే ఆయన కెరీర్ కి పెద్ద బూస్ట్ దొరికి ఉండేదని ఆయన అభిమానులు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నాగార్జున కి ‘ఊపిరి’ చిత్రం తర్వాత కమర్షియల్ గా ఒక్క సక్సెస్ కూడా లేదు. కొన్ని సినిమాలకు సున్నా షేర్స్ ని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండస్ట్రీ టాప్ స్థానంలో ఉంటూ ఇలాంటి అవమానకరమైన వసూళ్లను చూసి ఆయన అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఆయన కూడా విక్టరీ వెంకటేష్ లాగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలని కోరుకుంటున్నారు.