https://oktelugu.com/

Pawan Kalyan: లుక్ మార్చేసిన పవర్ స్టార్..’ఓజీ’ చిత్రం కోసం కసరత్తులు మొదలైనట్టేనా!

నిర్మాతలు పవన్ కళ్యాణ్ ని కలిసి డేట్స్ గురించి చర్చలు జరిపారట. సెప్టెంబర్ చివరి వారం,లేదా అక్టోబర్ మొదటి వారం నుండి డేట్స్ కేటాయిస్తానని మాటిచ్చారట. ఇచ్చిన మాటప్రకారమే పవన్ కళ్యాణ్ తనని తాను సిద్ధం చేసుకుంటున్నట్టు నేడు ఆయన సరికొత్త లుక్స్ చూసిన తర్వాత అర్థమైంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 13, 2024 / 01:55 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే సమయంలో ఒకలాగా ఉంటారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. సినిమాల సమయంలో ఎంతో స్టైలిష్ లుక్స్ తో కనిపిస్తారు. కానీ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్నంతసేపు తెల్లని దుస్తులు ధరించి గుబురు గెడ్డం, పొడవాటి జుట్టుతో కనిపిస్తారు. గత ఏడాది కాలం నుండి ఆయన రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. అందుకే ఏడాది నుండి పవన్ కళ్యాణ్ ని అభిమానులు తెల్లని వస్త్రాలలో గుబురు గెడ్డంతో చూస్తూ వచ్చారు. అయితే నేడు ఆయన లుక్ మార్చాడు. ఈరోజు శ్రీహరి కోటలో జాతీయ స్పేస్ డే ని పురస్కరించుకొని ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఆయన ఇన్ని రోజులు పెంచుకున్న గెడ్డం ని తొలగించి మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ లుక్ తెగ వైరల్ గా మారింది. గెడ్డం గీసారంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ షూటింగ్స్ కోసం సిద్ధం అవ్వబోతున్నారా అని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ , ‘హరి హర వీరమల్లు’ చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు సగానికి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాయి. మిగతా సగం కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించాల్సి ఉంది. ఇటీవలే నిర్మాతలు పవన్ కళ్యాణ్ ని కలిసి డేట్స్ గురించి చర్చలు జరిపారట. సెప్టెంబర్ చివరి వారం,లేదా అక్టోబర్ మొదటి వారం నుండి డేట్స్ కేటాయిస్తానని మాటిచ్చారట. ఇచ్చిన మాటప్రకారమే పవన్ కళ్యాణ్ తనని తాను సిద్ధం చేసుకుంటున్నట్టు నేడు ఆయన సరికొత్త లుక్స్ చూసిన తర్వాత అర్థమైంది. ముందుగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అక్టోబర్ 1 నుండి 14 వ తేదీ వరకు డేట్స్ కేటాయించాడట. ఆ తర్వాత ఆయన వెంటనే ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

    ఈ రెండు సినిమాల కంటే ముందుగా ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి ఒక వారం రోజులపాటు సాగే చిన్న షెడ్యూల్ కోసం డేట్స్ కేటాయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే లుక్స్ మార్చాడని అంటున్నారు అభిమానులు. ఇప్పటికే ‘ఓజీ’ చిత్రాన్ని సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు మూవీ టీం ప్రకటించి వాయిదా వేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2 న ఒక స్పెషల్ వీడియో ద్వారా తెలియచేయనున్నారు. ఈ చిత్రంతో పాటుగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హర వీరమల్లు’ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా రానున్నాయి. అలా ఆరోజు మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే అని అంటున్నారు, చూడాలి మరి.