https://oktelugu.com/

Shah Rukh Khan: తెలుగులో షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సినిమాలు ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారు? అసలేంటి కథ…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఉన్నప్పటికీ బాలీవుడ్ హీరోలకు అప్పట్లో చాలా మంచి క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. బాలీవుడ్ హీరోలను డామినేట్ చేస్తూ మన హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 2, 2024 / 12:05 PM IST

    Shah Rukh Khan

    Follow us on

    Shah Rukh Khan: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఏ స్టార్ హీరో బర్త్ డే వచ్చినా కూడా ఆయనకు సంబంధించిన పాత సినిమాలని రిలీజ్ చేస్తూ ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమాని రీ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేయాలని ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే పలు సినిమాలు రీ రిలీజ్ అయినప్పటికీ కింగ్ ఖాన్ ‘షారుఖ్ ఖాన్’ నటించిన కొన్ని సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే 2004వ సంవత్సరంలో షారుక్ ఖాన్, ప్రీతి జింటా హీరో హీరోయిన్ గా యశ్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘వీర్ జర’ సినిమాని రీ రిలీజ్ చేయడానికి అందులోనూ హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని షోస్ కూడా కేటాయించి ఇక్కడ రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే వీర్ జర సినిమాకి తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. వాళ్లందరి కోసమే ఈ సినిమాని సెప్టెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు భారీ వసూళ్లను సాధించింది.

    ఇక రీ రిలీజ్ లో కూడా అలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందని సినిమా యూనిట్ నమ్ముతుంది. ఇక దీంతో పాటుగా షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన పరదేశి సినిమాను కూడా ఈనెల 20 లేదా 27వ తేదీన గాని రిలీజ్ చేయడానికి సన్నాహాలైతే చేస్తున్నారు. దీని ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాలకు మంచి ఆదరణ దక్కితే రాబోయే రోజుల్లో షారుక్ ఖాన్ తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది…

    ఇక అందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమాలకి తెలుగులో మంచి ఆదరణ దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…ఇక గతంలో షారుక్ ఖాన్ సినిమాలు తెలుగులో డబ్ అయినప్పటికీ పెద్దగా ఆదరణ అయితే దక్కించుకోలేకపోతున్నాయి.

    అందువల్లే ఈ సినిమాలు రీ రిలీజ్ చేసి తెలుగు లో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక గతంలో పఠాన్, జవాన్ లాంటి సినిమాలు తెలుగులో మంచి రిలీజ్ లను దక్కించుకున్నప్పటికీ ఆశించిన మేరకు కలెక్షన్స్ ను అయితే కొల్లగొట్టలేకపోయాయి…