Paralympics 2024 : పారాలింపిక్స్ లో మన అథ్లెట్లకు పతకాల పంట.. ప్రధాని మోడీ ఎలా స్పందించారంటే..

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ మన దేశ అథ్లెట్లు మెడల్స్ పంట పండిస్తున్నారు.. ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన పోటీలలో ప్రీతి పాల్, నిషాద్ కుమార్ మెడల్స్ సాధించారు.. ఈ క్రమంలో వారిని ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 2, 2024 12:01 pm

Paralympics 2024

Follow us on

Paralympics 2024 :  పారిస్ లో ఆదివారం ఛటౌరోక్స్ వేదికగా పారాలింపిక్స్ జరిగాయి. ఈ పోటీలలో పారా అథ్లెట్లు నిషాద్ కుమార్, ప్రతి పాల్ సత్తా చాటారు. రజతం, కాంస్యం సాధించారు.. ఈ విజయం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. పారా అథ్లెట్ ప్రీతి సాధించిన గెలుపును ” చారిత్రాత్మక విజయం గా అభివర్ణించారు.. నిశాంత్ కుమార్ విజయం సాధించడం వల్ల ” భారత్ ఉప్పొంగిపోయిందని” అభివర్ణించారు. “ప్రీతి పాల్ చారిత్రాత్మక విజయం సాధించింది. పారాలింపిక్స్ 2024 ఎడిషన్ లో మహిళల 200 మీటర్ల T35 ఈవెంట్ లో కాంస్యం సాధించింది..పారాలింపిక్స్ లో వరుసగా రెండవ మెడల్ సాధించింది. ఆమె భారతీయ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆమె అంకితభావం నిజంగా గొప్పదని” నరేంద్ర మోడీ ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొన్నారు..” పారాలింపిక్స్ పురుషుల హై జంప్ T47 ఈవెంట్ లో నిషాద్ కుమార్ రజతాన్ని గెలుచుకున్నాడు. అక్కడికి అభినందనలు. దృఢ సంకల్పంతో ఏదైనా సాధించవచ్చు అని ఆయన నిరూపించాడు. చిత్తశుద్ధిమందు ఏవైనా కాళ్ల దగ్గరికి వస్తాయని ఆయన నిజం చేసి చూపించాడు. నిషాద్ కుమార్ విజయంతో భారత్ ఉప్పొంగిపోతోందని” నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

భారత్ ఖాతాలో ఏడు మెడల్స్

పారాలింపిక్స్ భారత్ సత్తా చాటుతోంది. ఇప్పటికే ఒక స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్యాలతో ర్యాంకింగ్స్ జాబితాలో భారత్ 27వ స్థానంలో ఉంది. ప్రీతి, నిషాద్ సాధించిన విజయాల నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ” పారిస్ పారాలింపిక్స్ లో మహిళల 200 మీటర్ల T35 ఈవెంట్ లో కాంస్యం సాధించిన ప్రీతి పాల్ కు అభినందనలు. ఆమె ఇంతకుముందు 100 మీటర్ల ఈ వెంట్ లో కాంస్యం సాధించింది. ఇది అసాధారణమైన విజయం. భారత్ ఆమెను చూసి గర్విస్తోంది. త్రివర్ణ పతాకాన్ని రెండు చేతుల్లో పట్టుకొని ఆమె నడుస్తూ వస్తున్న దృశ్యాలు దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆమె యువతలో క్రీడాస్పూర్తిని పెంపొందిస్తోంది. ఇదే ఒరవడి ఇంకా కొనసాగించాలని” రాష్ట్రపతి ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొన్నారు. ” పారాలింపిక్స్ హై జంప్ విభాగంలో రజితం సాధించిన నిషాద్ కుమార్ కు హృదయపూర్వక అభినందనలు. టోక్యో పారాలింపిక్స్ లో అతడు రజత పతకం సాధించాడు. పారిస్ పారాలింపిక్స్ లోనూ రజతం సాధించి రికార్డు సృష్టించాడు. పారాలింపిక్స్ లో అతడికి వరుసగా ఇది రెండవ రజత పతకం. అతడి నిలకడ, పట్టుదల దేశంలోని క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోందని” రాష్ట్రపతి ట్విట్టర్ ఎక్స్ లో వ్యాఖ్యానించారు.

పారాలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ప్రీతి పాల్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల హై జంప్ T47 విభాగంలో నిషాద్ వరుసగా రెండో రజతం సాధించాడు.