Tollywood: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు గానీ దర్శక నిర్మాతలు గానీ పండగల సీజన్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా మన దర్శకులు అయితే దసర, సంక్రాంతి లను మాత్రమే ఫోకస్ చేసి సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ సమ్మర్ అనేది ఒకటి ఉందని దాన్ని క్యాష్ చేసుకుందాం అనే ఉద్దేశ్యం లో ఎవరు ఉన్నట్టుగా కనిపించడం లేదు. అందుకే ఈ సమ్మర్ కి ఏ ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు.
ఇక ఇప్పటికే ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమా సమ్మర్ కి రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా డేట్ ని అనౌన్స్ చేసినప్పటికీ, మిగతా ఏ సినిమాలు కూడా సమ్మర్ ని వాడుకుందామనల్నే ప్రయత్నంలో అయితే ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇక అన్ని సినిమాలు కూడా జూలై నెల నుంచి రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. మొదటగా దేవర సినిమా ప్రభంజనం స్టార్ట్ అవుతుండగా, ఆ సినిమా తర్వాత ఆగస్టు 15 కి పుష్ప 2 సినిమా బరిలోకి దిగుతుంది.
ఇక అది వచ్చిన నెల రోజులకి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత దసరా సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇక మొత్తానికైతే జూలై నుంచి మూడు నెలల్లో దాదాపు మూడు నుంచి నాలుగు వేల కోట్ల బిజినెస్ ని టాలీవుడ్ ఇండస్ట్రీ చేయబోతున్నట్టు గా తెలుస్తుంది…
ఇక మన స్టార్ హీరోలందరు ఈ సంవత్సరం థియేటర్లోకి రావడం పక్కా అని తెలుస్తుంది. మహేష్ బాబు సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాతో అందరి కంటే ముందే థియేటర్లోకి వచ్చి సందడి చేశాడు…ఇక ఇప్పుడు వరుసగా ప్రభాస్, ఎన్టీయార్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలతో మన హీరోలందరూ సూపర్ సక్సెస్ లను కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…