https://oktelugu.com/

Game changer : కర్ణాటకలో మన సినిమాలను ఎందుకు బ్యాన్ చేస్తున్నారు.. అసలు వివాదం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పాన్ ఇండియా హీరోలుగా ఎదుగుతున్న క్రమంలో మన హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : January 6, 2025 / 09:32 AM IST

    Game changer

    Follow us on

    Game changer : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పాన్ ఇండియా హీరోలుగా ఎదుగుతున్న క్రమంలో మన హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ఈ సంక్రాంతి బరిలో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. అలాగే వెంకటేష్ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఇక బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ సినిమాతో మరోసారి సంక్రాంతి విన్నర్ గా నిలవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు.

    ఇక ప్రస్తుతం ఈ సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాల మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. వీటిలో అన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి…ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను కర్ణాటకలో బ్యాన్ చేయాలి అంటూ కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ రెండు సినిమాలను బ్యాన్ చేయాలని హ్యాష్ ట్యాగ్ లను కూడా పెడుతూ సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇంతకీ ఈ రెండు సినిమాలను బ్యాన్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు. కర్ణాటక జనాల్లో ఎందుకు ప్రతి విషయంలో బ్యాన్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుందనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నిజానికి ఈ రెండు సినిమాలను బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…

    అయితే గేమ్ చేంజర్ సినిమా పోస్టర్ లో సినిమా టైటిల్ ఇంగ్లీషులో వేశారు. అలా కాకుండా కన్నడ లో టైటిల్ వేసి పోస్టర్ వేయాలట. అలాగే సంక్రాంతి వస్తున్నాం సినిమాకి కూడా తెలుగులో టైటిల్ వేయడం వల్లే వాళ్ళ ఇగో హర్ట్ అయి ఆ సినిమాలను అక్కడ రిలీజ్ చేయనివ్వం అంటు అక్కడ వేసిన పోస్టర్లకు సినిమా టైటిల్ దగ్గర మార్క్ చేస్తూ వాటిని హైడ్ చేస్తున్నారు…నిజానికి ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క సినిమా సొంత భాషలో రిలీజ్ అవుతుంది.

    అలాగే అక్కడున్న భాషలో కూడా రిలీజ్ అవుతుంది అంటే రెండు భాషల్లో రిలీజ్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి బెంగుళూర్ లో సెటిల్ అయిన వారు ఈ సినిమాలను తెలుగులో చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళు తెలుగు వెర్షన్ లోనే సినిమా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి అలా అయితేనే ఆ సినిమాను ఓన్ చేసుకుంటారు. ఇక ఇంతకు ముందు నుంచి అలానే చూస్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా దానికే ఎక్కువ ప్రియర్టీ ఇస్తారు.. అలాగే తెలుగులో చూస్తే మన హీరోలకు వాళ్లే డబ్బింగ్ చెబుతారు దానివల్ల ఆ ఫీల్ అయితే క్యారీ అవుతుందనే ఉద్దేశ్యంతో వాళ్లు అలా చూస్తూ ఉంటారు.

    మరి ఇలాంటి సందర్భంలో సినిమానే తెలుగులో వస్తున్నప్పుడు అక్కడ తెలుగు పోస్టర్లను వేస్తే తప్పేంటి అని కొంతమంది వాదిస్తున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం కన్నడ సినిమాలను తెలుగులో రిలీజ్ చేసినప్పుడు కేజిఎఫ్ కి తెలుగులో టైటిల్ వేశారు. కాంతార కి తెలుగు టైటిల్ వేశారు. అలాంటప్పుడు వీటికి కన్నడలో టైటిల్ వేస్తే తప్పేంటి అంటూ కొంతమంది కర్ణాటక ప్రేక్షకులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాలను అక్కడ బ్యాన్ చేస్తారా లేదా రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది…