https://oktelugu.com/

Vishal : ఇంతకీ విశాల్ కి ఏమైంది… సన్నబడ్డాడు, చేతులు వణుకుతున్నాయి…కారణం ఏంటి..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పటికి వాళ్లకు మంచి క్రేజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : January 6, 2025 / 09:41 AM IST

    Vishal

    Follow us on

    Vishal : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పటికి వాళ్లకు మంచి క్రేజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు. కారణమేదైనా కూడా వాళ్ళు చేస్తున్న సినిమాలు తమిళ్, తెలుగు భాషలకు మాత్రమే పరిమితం అవుతుండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా తమిళ్ నుంచి పాన్ ఇండియా హీరోలుగా ఎదిగిన వారు ఇప్పుడున్న జనరేషన్ లో ఎవ్వరూ లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి…

    తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న విశాల్ పందెంకోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో తెలుగులో ఆయనకు భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన తమిళ్లో చేసిన అన్ని సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నప్పటికి ఆ సినిమాలను మినహాయిస్తే మిగిలిన ఏ సినిమా కూడా తెలుగులో అంత పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయిందనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నప్పటికి తెలుగులో అంత పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నాయి. కారణమేదైనా కూడా ఆయన చేసే సినిమాల విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరమైతే ఉంది. ఇక దానికి తోడుగా ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే విశాల్ నటించిన ‘మదగజ రాజ’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యం లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తను హాజరయ్యాడు.

    ఇక అందులో విశాల్ ను చూసిన ప్రతి ఒక్కరు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆయన చాలా సన్నబడిపోయి చేతులు వణుకుతూ కనిపించడం స్టేజ్ మీదకు వెళ్లే క్రమంలో కూడా అతను సరిగ్గా నడవలేక నిదానంగా నడుచుకుంటూ వెళ్లడం చూసిన చాలామంది తనకి ఏమైంది అంటూ అతన్ని పరమశించారు.

    ఇక మొత్తానికైతే గత కొద్ది రోజుల నుంచి విశాల్ హై ఫీవర్, జలుబుతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నాడనే విషయమైతే తెలుస్తుంది. ఇక దాని వల్లే ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడట. 2013లో షూటింగ్ కంప్లీట్ చేసుకొన్న మదగజరాజ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందన్న ఉద్దేశ్యంతో ఆయన దాని ప్రమోషన్స్ లో పాల్గొనడమనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

    హై ఫీవర్ లో కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఆయన ఈవెంట్ కు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇక వేరే హీరో అయితే తనకి ఫీవర్ గా ఉందని ఈ ఈవెంట్ కి రాకుండా తప్పించుకుంటూ ఉంటారు. కానీ ఆయన మాత్రం అలా చేయలేదు. ఎందుకంటే ఆయన సినిమా సక్సెస్ అయితే మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నారు కాబట్టి ఫీవర్ ఉన్న కూడా సినిమా ప్రమోషన్స్ కోసం ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది…