Akhanda 2 Movie Updates: గొప్ప విజయాలను సాధించిన డైరెక్టర్లకు మాత్రమే సినిమా ఇండస్ట్రిలో మంచి గుర్తింపు ఉంటుంది. ఇక ఇదే తరహాలో కమర్షియల్ సినిమాలను చేస్తూ, ఊర మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు బోయపాటి శ్రీను…ఈయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే బాలయ్య బాబుతో చేసిన సినిమాలు మరొకెత్తుగా మారాయి…సింహ, లెజెండ్, అఖండ లాంటి సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ‘అఖండ 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయింది… ఇక ఈ మూవీ ఔట్ పుట్ సైతం అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదట. కారణం ఏంటి అంటే అఖండ మొదటి పార్ట్ లో దైవత్వాన్ని చాలా బాగా చూపించారు.
ఇక ఈ సినిమాలో అదే దైవత్వాన్ని కంటిన్యూ చేసినప్పటికి అదంతా ఎఫెక్టివ్ గా రాలేదని దానివల్లే సినిమా యావరేజ్ గా నిలిచే అవకాశం ఉందని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. ఇక దీని వల్ల సినిమా మీద వాళ్ళు పూర్తి కాన్ఫిడెంట్ గా లేనట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
మొత్తానికైతే ప్రస్తుతం తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీసినట్టుగా తెలుస్తోంది. కానీ సీన్లలో బలం లేకపోతే బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంత కొట్టినా కూడా సీన్ హైలెట్ అవ్వదు కదా అనే విషయాన్ని సైతం కొంతమంది విమర్శకులు తెలియజేస్తున్నారు. మరి వాళ్ళు అనుకుంటున్న దాని ప్రకారం బాలయ్య ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను సాధించిన ఆయన ఈ సినిమాతో ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకులు నెక్స్ట్ లెవెల్లో ఊహించుకుంటారు. ఇక ఈ మూవీ ఆ అంచనాలను రీచ్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…