https://oktelugu.com/

Game Changer : మెగా సెన్సేషనల్ ఈవెంట్..’గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్..పూర్తి వివరాలు ఇవే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం రీ యూనియన్ కాబోతుందా..?, మెగా అభిమానులు జీవితంలో మర్చిపోలేని ప్రీ రిలీజ్ ఈవెంట్ గా మారబోతుందా అంటూ అవుననే అంటున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 28, 2024 / 08:23 PM IST
    Follow us on

    Game Changer Pre Release Event : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం రీ యూనియన్ కాబోతుందా..?, మెగా అభిమానులు జీవితంలో మర్చిపోలేని ప్రీ రిలీజ్ ఈవెంట్ గా మారబోతుందా అంటూ అవుననే అంటున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడనే వార్త రెండు వారాల ముందే తెలిసింది. నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్న రామ్ చరణ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదేనంటూ అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. అయితే ఈ ఈవెంట్ గురించి లేటెస్ట్ గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ ఈవెంట్ కి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, చిరంజీవి, అల్లు అర్జున్ కూడా హాజరు కాబోతున్నాడని టాక్.

    దిల్ రాజు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాడట. ఏ క్షణం లో అయినా శుభ వార్త వినొచ్చని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే లక్షల సంఖ్యలో దేశవ్యాప్తంగా అభిమానులు హాజరు అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి దిల్ రాజు కి అధికారికంగా ఈ విషయం ఖరారైతే, ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన ఒక భారీ ఓపెన్ గ్రౌండ్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాటు చేస్తాడట. మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఈ సూపర్ స్టార్స్ మొత్తం కలిసి గతంలో చిరుత, మగధీర ఈవెంట్స్ లోనే కనిపించారు. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ నలుగురిని ఒకే వేదిక మీద చూసే అదృష్టం అభిమానులకు కలగబోతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ పేర్లు దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో మారు మోగిపోతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. వీళ్లిద్దరి మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది అంటూ మీడియా లో ఎప్పటి నుండో ఒక ప్రచారం ఉంది.

    పైగా రీసెంట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పై మెగా ఫ్యామిలీ లో బహిరంగంగా ఎవ్వరూ స్పందించలేదని, దీనిని బట్టి చూస్తే వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది అనే విషయం వాస్తవమే అనే నిర్ధారణకు వచ్చేసారు. ఇప్పుడు ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ వస్తే ఇన్ని రోజులు మెగా ఫ్యామిలీ గురించి మీడియా లో ప్రసారమయ్యే ప్రతీ రూమర్ కి ఒక సమాధానం దొరుకుంటుంది. ఒకప్పుడు అభిమానులంతా కలిసి ఎంత ఐకమత్యంగా ఉండేవాళ్ళో, ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది కార్య రూపం దాలుస్తుందా లేదా అనేది అతి త్వరలోనే తెలియనుంది. ఈ ఈవెంట్ ని జనవరి నాల్గవ తేదీన నిర్వహించబోతున్నారు. దిల్ రాజు తల్చుకుంటే ఏ పని అయినా జరుగుతుంది. ఆయన ఈసారి గట్టిగా తల్చుకున్నాడు కాబట్టి కచ్చితంగా ఈ ఈవెంట్ కార్యరూపం దాలుస్తుంది అంటున్నారు అభిమానులు.