Next Megastar of Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత 50 సంవత్సరాలుగా మెగాస్టార్ గా గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఒకే ఒక్కడు చిరంజీవి…ఇప్పటికీ భారీ సినిమాలను చేస్తూ ఆయన కంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి 70 సంవత్సరాల వయసులో కూడా సినిమాలను చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ఈ జనరేషన్ లో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పట్టి భారీ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని భర్తీ చేయగల హీరో ఎవరు అనే దానిమీదనే గత కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో నలుగురు సీనియర్ హీరోలను మినహాయిస్తే ఆరుగురు హీరోలు మాత్రమే స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అందులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు , ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అల్లు అర్జున్ లు ఉన్నారు… మరి వీళ్ళలో ఎవరు టాప్ లెవల్ కి వెళ్తారు. ఎవరు మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ను భర్తీ చేస్తూ అంతటి స్టార్ డమ్ ని అందుకోగలరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఇక మీద ఆయన సినిమాలు చేసే అవకాశాలైతే లేవు. ఒకవేళ ఆయన సినిమాలు చేసిన కూడా అడపాదడప సినిమాలు చేస్తాడు తప్ప నెంబర్ వన్ రేస్ కోసం పోటీలో నిలిచే అవకాశం అయితే లేదు… కాబట్టి మిగిలిన ఐదుగురిలోనే ఎవరు ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… ప్రతి హీరో కూడా తనకంటూ ఒక గొప్ప ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళను వాళ్ళు స్టార్లుగా మలుచుకోవడానికి అలాగే పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నారు.
Also Read: అతన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను..మరోసారి క్లారిటీ ఇచ్చిన అనుష్క!
వాళ్ళు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా నెంబర్ వన్ రేస్ లో కూడా ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ ఇప్పటివరకు ఉన్న హీరోలందరిలో నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పాన్ ఇండియాలో ఆయన చేసిన సినిమాలు ఇప్పటికే పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నాయి…
ఇక అల్లు అర్జున్ సైతం పుష్ప 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకొని 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాడు. కాబట్టి ఆయనకు కూడా నెంబర్ వన్ పొజిషన్ దక్కే అవకాశాలైతే ఉన్నాయి. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు సైతం ఇప్పుడు చేస్తున్న సినిమాలతో వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: అందరు మాస్ డైరెక్టర్లు అవ్వలేరా..?ఇది తెలుసుకుంటే ప్లాప్ సినిమాలు రావా..?
మహేష్ బాబు సైతం ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొడతానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కాబట్టి చిరంజీవి ప్లేస్ ని భర్తీ చేసే హీరో ఎవరనేది తెలియాలంటే మరొక మూడు, నాలుగు సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది…