Anushka Marriage News: హీరోయిన్స్ లో లేడీ సూపర్ స్టార్ అనే రేంజ్ స్థాయిని సంపాదించుకున్న అతి తక్కువమందిలో ఒకరు అనుష్క శెట్టి(Anushka Shetty). అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ‘సూపర్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన అనుష్క, ఆ సినిమా కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆమె వరుసగా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు దూసుకుపోయిన అనుష్క, ‘అరుంధతి’ చిత్రం తో తన కెరీర్ రూపు రేఖలను మార్చేస్తుకుంది. స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని కలెక్షన్స్ ని రాబట్టి లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అయితే బాహుబలి సిరీస్ తర్వాత అనుష్క శెట్టి సినిమాలు చేసే సంఖ్య ని బాగా తగ్గించింది. 2023 వ సంవత్సరం లో ఆమె చివరిసారిగా ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ లో కనిపించింది.
ఇప్పుడు క్రిష్(Krish Jagarlamudi) దర్శకత్వం లో ఆమె లీడ్ రోల్ లో నటించిన ‘ఘాటీ'(Ghaati Movie) చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే అనుష్క పెళ్లి వ్యవహారం కూడా మీడియా లో ఎప్పటి నుండో చర్చలో ఉన్న అంశమే. నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా ఆమె పెళ్లి చేసుకోకపోవడం పై అభిమానులు కాస్త అసంతృప్తి తో ఉన్నారు. ప్రభాస్(Rebel Star Prabhas) తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వినిపించాయి. అయితే అలాంటిదేం లేదని అటు ప్రభాస్, ఇటు అనుష్క ఖరాఖండీగా మీడియా కి తేల్చి చెప్పేసారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా అనుష్క ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి ఆసక్తికరమైన మాటలు మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ ‘నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్లిన పెళ్లి గురించే ప్రశ్నలు అడుగుతున్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని కచ్చితంగా జరుగుతాయి. కానీ ఎట్టి పరిస్థితిలో నేను ప్రేమ పెళ్లినే చేసుకుంటాను, ఇండస్ట్రీ లో అబ్బాయిని మాత్రం పెళ్లి చేసుకోను అంటూ చెప్పుకొచ్చింది.