Producers Losses: ప్రస్తుతం ఇండియన్ సినిమా రేంజ్ మారిపోయింది. లో బడ్జెట్ లో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ గా నిలపాలనే ఆలోచన అయితే చేయడం లేదు. ఏ స్టార్ హీరోని తీసుకున్న వందల కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాగే సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది. తద్వారా ప్రేక్షకుడి మీద టికెట్ రూపంలో అదనపు భారం వేసి భారీ లాభాలను ఆర్జించాలని ప్రొడ్యూసర్లు భావిస్తున్నప్పటికి అది ఎంత మాత్రం సెట్ అవ్వడం లేదు. ఇక దానికి అనుగుణంగా ప్రేక్షకులు కూడా థియేటర్ కి రావడం తగ్గించారు. ముఖ్యంగా ఒక సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప వాళ్ళు థియేటర్ కి వచ్చి సినిమాని చూడడం లేదు. అది కూడా ఫ్యామిలీతో రావాలంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దీనివల్ల ప్రొడ్యూసర్లకి విపరీతమైన నష్టాలైతే వస్తున్నాయి. మరి ఈ నష్టాలకు కారణం ఎవరు ఈ నష్టాలను పూడ్చేది ఎవరు? నిజానికి ఒక సినిమా సక్సెస్ అయితే థియేట్రికల్ రైట్స్ రూపంలో గానీ, సాటిలైట్ రైట్స్ లో గాని, ఓటిటి ప్లాట్ఫామ్స్ ద్వారా గాని ప్రొడ్యూసర్లు కొంతవరకు లాభాలను సంపాదిస్తారు. కానీ సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం ప్రొడ్యూసర్లకి వందల కోట్లలో నష్టాలు వచ్చి పడుతున్నాయి. మరి దీనికి కారణం ఏంటి ఒక సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం ఎవరు అనీ ధోరణిలోనే ఇప్పుడు చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. నిజానికి దర్శకుడు ఒక సినిమాని ప్రాణం పెట్టి తీసినప్పుడే ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది…
Also Read: ప్యారడైజ్ తేడా కొడితే శ్రీకాంత్ తో చిరంజీవి సినిమా చేస్తాడా..?
లేకపోతే మాత్రం ఎవరు ఎలాంటి నటనను కనబరిచిన కూడా ఆ సినిమా సక్సెస్ అయితే సాధించదు. కాబట్టి సినిమా ఫెయిల్యూర్ కి మూల కారణం దర్శకుడవుతాడు. ఆ సినిమా సక్సెస్ కి అతనే కారణం అవుతాడు, అలాగే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా తనే బాధ్యత వహించాల్సి ఉంటుంది… అందువల్ల మంచి కథలతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధిస్తే బాగుంటుంది.
అంతే తప్ప నాసిరకం కథలతో సినిమాలను చేసి ప్రొడ్యూసర్లకు విపరీతమైన నష్టాలను తెచ్చి పెడితే వాళ్లు వాటిని రికవరీ చేసుకోలేక అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడవచ్చు… ఇక ప్రస్తుతం ప్రొడ్యూసర్ నాగ వంశీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. కింగ్డమ్ సినిమాతో 60 కోట్ల నష్టాన్ని చవిచూసిన ఆయన ‘వార్ 2’ సినిమాని తెలుగులో రిలీజ్ చేసి దాదాపు 50 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికైతే 100 కోట్లకి పైన నష్టం వచ్చింది…
ఇక తన బ్యానర్ నుంచి రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి అది ఎంతవరకు సక్సెస్ అవుతోంది అనేది చెప్పలేని పరిస్థితి కాబట్టి ప్రొడక్షన్ ఖర్చులను తగ్గించి హీరోల రెమ్యూనరేషన్ ను తగ్గించి టికెట్ రేట్ తగ్గించినప్పుడే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు. అలాంటి రోజులు వచ్చినప్పుడే ప్రొడ్యూసర్లు నష్టాల బాట నుంచి లాభాల బాట పడతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…