Chiranjeevi Srikanth Odela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న నటుడు కూడా తనే కావడం విశేషం…ప్రస్తుతం ఆయన యాంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇప్పటికే వశిష్ఠ తో విశ్వంభర అనే సినిమా చేశాడు. ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాను సైతం 2026వ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక వీళ్ళతో పాటుగా బాబి డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక దసర సినిమాతో దర్శకుడిగా మాస్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే శ్రీకాంత్ ఓదెల నానితో చేస్తున్న ప్యారడైజ్ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తేనే అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. లేకపోతే మాత్రం శ్రీకాంత్ ఓదెలతో చేయాల్సిన సినిమాని మరొక దర్శకుడితో చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటికే చిరంజీవి ఖాతాలో చాలామంది యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఆ టైంకి సక్సెస్ బాటలో ఉంటారో వాళ్లకు మాత్రమే అవకాశాలు ఇచ్చే విధంగా చిరంజీవి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది… ప్యారడైజ్ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు.
Also Read: సందీప్ రెడ్డి వంగ తో పోటీ పడే కెపాసిటీ బాలీవుడ్ డైరెక్టర్స్ కి లేదా..?
తద్వారా ఆయనకంటూ ఎలాంటి క్రియేట్ అవుతుంది అనే దాన్ని బట్టి చిరంజీవి అతనికి అవకాశాన్ని ఇస్తాడా లేదా అనేది డిసైడ్ అవుతోంది…ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. తద్వారా ఆయన పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించగలుగుతాడా? లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది…
గత ఐదు దశాబ్దాలుగా చిరంజీవి డిఫరెంట్ మెంటాలిటీతో ఉన్న దర్శకులతో పని చేస్తూ వస్తున్నాడు. ప్రతి జనరేషన్ లో ఎవరో ఒక దర్శకుడు అతనికి భారీ సక్సెస్ లను అందిస్తున్నారు. మరి అలాంటి దర్శకుడు ఈ జనరేషన్లో ఎవరున్నారు అనే దాని మీదనే ఆయన ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది…
ఇక మొత్తానికైతే చిరంజీవి రాబోయే సినిమాలతో సక్సెస్ లను అందుకుంటే మరోసారి ఆయన పేరు హిస్టరీ లో చిరస్మరణీయంగా నిలిచిపోతోంది. లేకపోతే మాత్రం యంగ్ హీరోలతో పోటీ పడలేకపోతున్నాడు అంటూ చిరంజీవి మీద కొన్ని విమర్శలైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి…