Homeఎంటర్టైన్మెంట్హీరోలూ.. 'దసరా'కి ఖర్చీప్ లు ఎక్కువైపోయాయి !

హీరోలూ.. ‘దసరా’కి ఖర్చీప్ లు ఎక్కువైపోయాయి !

కోవిడ్ సెకెండ్ వేవ్ హడావుడితో టాలీవుడ్ కి సమ్మర్ కూడా దూరమైపోయింది. ఇప్పటికే సమ్మర్ సినిమాలు అన్నీ రిలీజ్ డేట్లను పోస్ట్ ఫోన్ చేసుకున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్ కూడా మరో మూడు నెలలు ఉండేలా కనిపిస్తోంది. ఎలాగూ సినిమాలు కూడా సగంలో ఆగిపోయాయి. కాబట్టి మళ్ళీ షూటింగ్ లు స్టార్ట్ అవ్వడానికి మరో మూడు నెలల సమయం.. అంటే, ఆగష్టులో మొదలయ్యే అవకాశం ఉంది.

ఇక ఆగష్టులో మొదలుపెట్టి.. చకచకా షూట్ ను పూర్తి చేసి దసరాకి రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నాయి. మొత్తమ్మీద థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయినా, తమ సినిమాలను మాత్రం దసరాకే రిలీజ్ చేయాలని ఇప్పటికే చాలా మంది పెద్ద దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అయితే అందరూ దసరాకే రిలీజ్ ను ప్లాన్ చేసుకుంటే పోటీ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ పోటీలో సినిమాకి ఎంత గొప్ప పాజిటివ్ టాక్ వచ్చినా.. ఆ రేంజ్ లో కలెక్షన్స్ రాకపోవచ్చు.

కాబట్టి దసరాకి ఎక్కువ సినిమాలు రిలీజ్ కాకుండా, థియేటర్స్ ను చేతిలో పెట్టుకున్న బడా నిర్మాతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. కాకపోతే, ఎవరి సినిమా పోస్ట్ ఫోన్ చేయాలి, ఏ స్టార్ హీరోతో మీ సినిమాని పోస్ట్ ఫోన్ చేసుకో అని చెప్పాలి అని నిర్ణయించుకోలేక సతమతమవుతున్నారు. మెగా సినిమాలను అలాగే బన్నీ ‘పుష్ప’ను దసరా రేసులో నుండి బయటకు వెళ్ళమనలేరు. థియటర్స్ లో వాళ్లకు వాటా ఉంది కాబట్టి.

అదే విధంగా మహేష్ ‘సర్కారు వారి పాట’ను, ప్రభాస్ ‘రాధే శ్యామ్’ను కూడా రేసు నుండి తప్పుకోండి అని చెప్పే దైర్యం లేదు. కచ్చితంగా ఈ రెండు సినిమాల్లో దసరాకి ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఇదిలా వుంటే ఇప్పటకే అన్ని విధాలా రెడీగా వున్న బాలయ్య ‘అఖండ’ సినిమాను కూడా దసరా బరిలోకే దించాలని చూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందించారు. మరి ఈ సారి దసరా పోటీలో ఎవరు ఉంటారో, ఎవరు తప్పుకుంటారో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version