Manchu Family: మోహన్ బాబు, మనోజ్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. తండ్రి కొడుకులు కాస్తా బద్ద శత్రువులు గా మారారు. భౌతిక దాడుల నుండి, కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు. గత మూడు రోజులుగా హైదరాబాద్ లోని జుల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంటుంది. మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కిన నేపథ్యంలో అసలు ఎవరిది తప్పు అనే చర్చ మొదలైంది..
ఐదు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానం కలిగిన మోహన్ బాబుకు పరిశ్రమలో ఒక గౌరవం ఉంది. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా చలామణి అయ్యాడు. నిర్మాతగా పదుల సంఖ్యలో చిత్రాలు నిర్మించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. రాజకీయాల్లో కూడా రాణించాడు. పార్లమెంట్ కి వెళ్లారు. ఇంతటి ఘనకీర్తి ఉన్న మోహన్ బాబు ఇమేజ్ భారీగా దెబ్బతింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కుటుంబ గౌరవం రోడ్డున పడేశాయి. మోహన్ బాబు-మనోజ్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. భౌతిక దాడులు చేసుకోవడంతో పాటు, కేసులు పెట్టుకున్నారు.
మోహన్ బాబు-మనోజ్ ల వ్యవహారం, పరిశ్రమను ఊపేస్తున్న తరుణంలో… అసలు ఎవరిది తప్పనే చర్చ మొదలైంది. ఈ విషయాన్ని లోతుగా విశ్లేషిస్తే.. మనోజ్ ని మోహన్ బాబు కొంత నిర్లక్ష్యం చేశాడేమో అనిపిస్తుంది. విష్ణుతో సమానంగా మనోజ్ ని చూడటం లేదనే వాదన ఉంది. ఇందుకు కారణాలు గమనిస్తే… విష్ణును రూ. 30 కోట్ల బడ్జెట్ తో గ్రాండ్ గా లాంచ్ చేశారు. మోహన్ బాబు స్వయంగా నిర్మించిన ‘విష్ణు’ మూవీ బడ్జెట్ రూ. 30 కోట్లు అని సమాచారం. 2003లో అంత బడ్జెట్ అంటే చాలా ఎక్కువ.
కానీ ఈ సినిమా పెద్ద మొత్తంలో నష్టాలు మిగిల్చింది. అదే సమయంలో మనోజ్ ని చాలా సాదా సీదాగా లాంచ్ చేశాడు. మనోజ్ డెబ్యూ మూవీ దొంగ దొంగది ఒక రీమేక్. తమిళంలో ధనుష్ చేసిన చిత్రాన్ని మనోజ్ తెలుగులో చేశాడు. దొంగ దొంగది మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విష్ణుతో మోహన్ బాబు ఎక్కువ సినిమాలు నిర్మించారు. విష్ణుతో పోల్చుకుంటే మనోజ్ మాత్రం ఇతర నిర్మాతలపై ఆధారపడ్డాడు.
విష్ణు హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఆయనకు కనీస మార్కెట్ లేదు. విష్ణు గత చిత్రం జిన్నా కోటి రూపాయలు వసూలు చేయలేదు. అలాంటి విష్ణుతో 100 కోట్లు పెట్టి కన్నప్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. మరోవైపు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఆరేళ్ళు అవుతుంది. 2018 తర్వాత మనోజ్ సినిమా చేయలేదు. గతంలో మనోజ్ అహం బ్రహ్మస్మి టైటిల్ తో ఒక మూవీ ప్రకటించారు. మోహన్ బాబు మద్దతు ఇవ్వలేదు. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
కుటుంబ ఆదాయం మొత్తం విష్ణు కోసమే మోహన్ బాబు ఖర్చు చేస్తున్నారు. సినిమాలు ఆడకున్నా … విష్ణుతో చేస్తూనే ఉన్నారు. ఇది కూడా మనోజ్ తిరుగుబాటుకు కారణం. ఇక మంచు కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా తిరుపతిలోని శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ ఇంస్టిట్యూరిన్స్ ఉన్నాయి. దానిపై పూర్తి ఆధిపత్యం విష్ణుకి ఇచ్చాడు. మనోజ్ కి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.
మూవీ ఆర్టిస్ట్స్ ఎన్నికల్లో విష్ణు గెలుపుకోసం అహర్నిశలు మోహన్ బాబు పని చేశారు. చిన్న కొడుకు విషయంలో ఆయనకు అంత శ్రద్ధ లేదు. మంచు లక్ష్మి కూడా మోహన్ బాబుపై గుర్రుగా ఉంది. ఆమె ముంబైకి షిఫ్ట్ అయ్యింది. మనోజ్ వర్గం ఈ కారణాలు చూపుతూ మోహన్ బాబుదే తప్పు అంటున్నారు. కుటుంబ అంతర్గత విషయాలు మనకు తెలియవు కాబట్టి… ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? అనేది తేల్చలేం..
Web Title: Who is wrong among mohan babu vishnu and manoj where did the original controversy begin
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com