Rajamouli vs Sandeep Reddy Vanga
Rajamouli vs Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నవే కావడం విశేషం… ఆయన మహేష్ బాబు(Mahesh Babu) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే రాజమౌళి మేకింగ్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ టెంపో లో తన మేకింగ్ ని మెయింటెన్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఎక్కడ ఎమోషనల్ సీన్ కావాలి ఎక్కడ యాక్షన్ ఎపిసోడ్ కావాలి అనేది బ్యాలెన్స్ గా తీసుకెళ్తూ ఉంటాడు. ప్రేక్షకుడి నాడి తెలిసిన దర్శకుడిగా రాజమౌళిని అభివర్ణిస్తుంటారు. మరి ఆయన చేసే ప్రతి సినిమాలో కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండడమే కాకుండా వాటిని ప్రతి ప్రేక్షకుడు చూస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఆయన చేసే ప్రతి సీన్ లో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా మేకింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే రాజమౌళి అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉండటంతో పాటు ఆయనకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడానికి అసలు కారణం అదే…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ(Sandeep Reddy Vanga)…ఈయన సినిమాల్లోని సీన్లు చాలా బోల్డ్ గా ఉంటాయి. ముఖ్యంగా ఆయన యూత్ ను ఆకర్షించే సీన్స్ ని ఎక్కువగా తీస్తూ ఉంటాడు. ఏవైనా సీన్స్ రాసుకునేటప్పుడు సీన్స్ కి కథ అడ్డం వస్తే కథను కూడా మార్చే విధంగా ఆయన సీన్స్ ను డెవలప్ చేస్తూ ఉంటాడు. ఇక మీటింగ్ పరంగా అయితే చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ తో ప్రేక్షకులను సినిమాకి కనెక్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు…
ఇక రాజమౌళి సందీప్ రెడ్డి వంగ ఇద్దరి మేకింగ్ స్టైల్ లో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ కెమెరాతో డిఫరెంట్ ప్రయోగాలు చేస్తూ తన మేకింగ్ ని చూపిస్తూ ఉంటాడు. కానీ రాజమౌళి మాత్రం ఎక్కువగా గ్రాఫిక్స్ ని వాడుతూ ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నమైతే చేస్తుంటాడు. మేకింగ్ పరంగా తోపులే అయినప్పటికి ఎవరి సినిమాకు తగ్గట్టు వాళ్లు మేకింగ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇద్దరి మధ్య చాలా విపరీతమైన పోటీ ఉందన్న విషయం మనందరికి తెలిసిందే.
రాజమౌళి సైతం తనకు పోటీ ఇచ్చేది సందీప్ రెడ్డి వంగనే అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ప్రస్తుతానికి ఇద్దరు కూడా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు సూపర్ సక్సెస్ ని సాధిస్తారనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…