Top Directors: రాజ్ కుమార్ హిరానీ, శంకర్ , రాజమౌళి వీళ్ళ లో టాప్ డైరెక్టర్ ఎవరు..? వీళ్లలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి..?

వీళ్ళ ముగ్గురిలో ఎవరు టాప్ డైరెక్టర్ అనే విషయం మీద రోజు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు అయితే నడుస్తున్నాయి. ఇక వీళ్ళ ముగ్గురిలో టాప్ డైరెక్టర్ ఎవరు అనేది చెప్పడం కష్టమే..

Written By: Gopi, Updated On : March 12, 2024 4:48 pm

Top directors in India

Follow us on

Top Directors: ప్రస్తుతం అన్ని భాషల సినిమాలని ప్రేక్షకులు చూస్తూ ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఈ భాష, ఆ భాష అనే తేడా లేకుండా సినిమా ఒక్కటే ప్రేక్షకులకు కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ ఏ సినిమా బాగుంది అని టాక్ వచ్చినా కూడా ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాను చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. థియేటర్ లోకి వెళ్లి చూడలేకపోయిన కనీసం ఓటిటి లో అయిన సినిమాను చూసి సక్సెస్ ని అందిస్తున్నారు. తెలుగులో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి,(Rajamouli) బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా తనకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న రాజ్ కుమార్ హిరాని,(Rajkumar Hirani) అలాగే తమిళంలో సూపర్ సక్సెస్ ఫుల్ దర్శకుడుగా తనకంటూ ఉన్న మంచి పేరును కాపాడుకుంటూ వస్తున్న శంకర్(Shankar)…

వీళ్ళ ముగ్గురిలో ఎవరు టాప్ డైరెక్టర్ అనే విషయం మీద రోజు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు అయితే నడుస్తున్నాయి. ఇక వీళ్ళ ముగ్గురిలో టాప్ డైరెక్టర్ ఎవరు అనేది చెప్పడం కష్టమే…ఎందుకంటే ముగ్గురు మూడు సపరేట్ వేరియేషన్స్ లో సినిమాలు చేస్తారు. ఎవరి స్టైల్ లో వాళ్లు సినిమాలు తీసి సక్సెస్ లను కొట్టడంలో ఎవరికి వాళ్లే తోపు… అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శంకర్, రాజ్ కుమార్ హిరాని కొంతవరకు ఫెయిల్యూర్స్ అయితే ఎదుర్కొన్నారు. కాబట్టి ఇప్పటివరకు రాజమౌళి తను చేసిన అన్ని సినిమాలని సూపర్ సక్సెస్ చేశాడు.

కాబట్టి ప్రస్తుతానికైతే తనే నెంబర్ వన్ దర్శకుడుగా కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది చేసినా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ ఒకటే మాట్లాడుతుంది. కాబట్టి రాజమౌళి తన పూర్తి ఎఫర్ట్ పెట్టైన సినిమాని సక్సెస్ చేసే దిశ గా ముందుకు తీసుకెళ్తాడు. అందుకే ఆయనకి ఉన్న గుర్తింపు మరే డైరెక్టర్ కి లేదని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ముగ్గురు డైరెక్టర్స్ కూడా ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దర్శకులే కావడం విశేషం…ఇక ఇది ఇలా ఉంటే ఇండస్ట్రీ లో వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు…