Prabhas-Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తనదైన రీతిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడనే చెప్పాలి. ఇక ఇప్పటికే బాహుబలి తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ కూడా 300 కోట్లకు పైన వసూళ్లను రాబట్టాయి. ఇక గత సంవత్సరం వచ్చిన ‘ సలార్’ సినిమా దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి ఆ సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమాల్లో భారీ హిట్టు సాధించిన సినిమాల్లో ఒకటి గా నిలవడం అనేది ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇక రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ ఇప్పటివరకు ఛత్రపతి, బాహుబలి, బాహుబలి 2 అనే మూడు సినిమాలు చేశాడు.. ఈ మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాయి. అయితే ఇందులో ఛత్రపతి సినిమా చేసినప్పుడు రాజమౌళికి ప్రభాస్ కి మధ్య ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన బివిఎస్ఎన్ ప్రసాద్ గొడవ పెట్టించాడట. అది ఎలా అంటే ప్రభాస్ ఎప్పుడో ఒకసారి ట్రిప్ కి పోదామని అనుకుంటాడట. అనుకోకుండా ఛత్రపతి సినిమా షూటింగ్ టైమ్ లో వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడట.
అందులో భాగంగానే ఆయన ఒకసారి ట్రిప్ వేద్దామని రాజమౌళికి చెప్పాడట. రాజమౌళి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కానీ అనుకోని సందర్భాల్లో వీళ్ళు ఏ డేట్ లో అయితే ట్రిప్ ప్లాన్ చేశారో ప్రొడ్యూసర్ ఆ డేట్ లో షూట్ ఫిక్స్ చేయడంతో రాజమౌళి ప్రభాస్ తో మనం వెళ్లడం వీలు కాదని చెప్పారట. ఇక దాంతో ప్రభాస్ రాజమౌళి పైన కొంతవరకు కోపంతో ఉన్నాడట.
అలా వీళ్ళిద్దరి మధ్య చిన్న వాగ్వివాదం జరిగి ఒక 2 రోజుల పాటు మాట్లాడుకోలేదట. ఇక మొత్తానికైతే మళ్లీ షూటింగ్ లో బిజీగా అయిపోవడం తో వాళ్ళిద్దరి మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయాయని ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి, ప్రభాస్ ఇద్దరు కలిసి చెప్పడం విశేషం…