Astrologer Venu Swamy About Prabhas Reaction To His Reels
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ మధ్య కాస్త రూటు మార్చాడు. మొన్నటి వరకు సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అయ్యాడు. ఇప్పుడు తన భార్య తో కలిసి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ తెగ ట్రెండ్ అవుతున్నారు. వేణు స్వామి కూడా సోషల్ మీడియా స్టార్స్ లిస్ట్ లో చేరిపోయాడు. రోజుకో కొత్త రీల్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. తాజాగా ప్రభాస్ నటించిన మిర్చి సినిమా లోని ఓ సీన్ స్పూఫ్ చేసాడు.
భార్య వీణ శ్రీవాణితో కలిసి చేసిన మిర్చి స్పూఫ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మిర్చి చిత్రంలో ప్రభాస్ – అనుష్క మధ్య జరిగే ఫన్నీ సీన్ ను రీ క్రియేట్ చేశారు. మిర్చి మూవీలో అనుష్క… ‘ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు?’ అని ప్రభాస్ ని అడుగుతుంది. ‘చదువుకున్న అమ్మాయి అయితే బాగుంటుంది’ అని ప్రభాస్ చెప్తాడు. ‘చదువుకున్న అమ్మాయి అయితే నువ్వు నేను సమానం అంటుంది. చదువుని ఏమైనా తింటావా. పిల్లలకు ఏబిసిడిలు నేర్పించుకుంటే చాలు’ అని అంటుంది. ఈ రొమాంటిక్ సీన్ ని వేణు స్వామి తన భార్యతో చేశాడు.
కాగా ఈ వీడియోను ప్రభాస్ చూశారట. ఈ మేరకు వేణు స్వామి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మిర్చీ స్పూఫ్ రీల్ ని ప్రభాస్ చూశారు. ఆయన చాలా కూల్ గా రియాక్ట్ అయ్యారని వేణు స్వామి అన్నాడు. అంతేకాదు… నా కంటే మీరే చాలా స్టైలిష్ గా ఉన్నారు అని ప్రభాస్ వేణు స్వామితో అన్నారట. తనకు ప్రభాస్ కి మధ్య అంత క్లోజ్ నెస్ ఉంది. కానీ ప్రభాస్ బాగుండాలని జాగ్రత్తలు చెబుతుంటే అతని ఫ్యాన్స్ మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వేణు స్వామి ఆవేదన చెందాడు. మరి వేణు స్వామి చెప్పిన ఈ మాటలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.
వేణు స్వామి ఇంకా మాట్లాడుతూ.. అందరూ స్టార్స్ పర్సనల్ విషయాలు అన్నీ నాకు తెలుసు. కానీ అవన్నీ బయటకు చెప్పను. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రమే చెప్పడం నా పని అని వేణు స్వామి చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా ప్రభాస్ కి వేణు స్వామి భార్య స్పెషల్ గిఫ్ట్ పంపింది. తమ పొలంలో పండిన సీతాఫలాలను ప్రభాస్ కి ఇచ్చారు. ఒకసారి పంపితే ప్రభాస్ మరల అడిగారని వీణా శ్రీవాణి ఆ వీడియోలో వెల్లడించారు.