Bigg Boss 7 Telugu: వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే శోభా కెప్టెన్సీ ఎలా ఉందని అర్జున్ ని అడిగారు. ఏసీ రూంలో ఎంజాయ్ చేయడమే సరిపోయింది సార్’ అని అర్జున్ చెప్పాడు. ఇక శోభా తో ‘ ఆ కాఫీ ఏదో పెట్టి స్టోర్ రూంకి పంపించమ్మా .. నేను తాగుతా’ అని నాగార్జున అన్నారు. ఇక శోభా ‘ నిజమా సార్ అంటూ ఆనందంలో తెలిపోయింది. తర్వాత రతిక తో ‘ రతికా .. ప్రియాంక జీవితంలో నిప్పులు పోస్తావా ‘ అని అడిగారు.
దీంతో రతిక ‘ అన్నయ్యలా చెల్లెలికి రోజ్ ఇస్తానన్నాడంతే ‘ అని చెప్పింది. రతిక నువ్వు ఎప్పుడు ఎవరిని అన్నయ్య అంటావో మాకు తెలియదు అంటూ పంచ్ వేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూంకి పిలిచి మాట్లాడారు నాగార్జున. ప్రశాంత్ తో తన తండ్రి హౌస్ లోకి వచ్చిన విషయం గురించి ప్రస్తావించారు. తర్వాత కెప్టెన్ ఎవరు మీరే డిసైడ్ చెయ్యాలని కంటెస్టెంట్స్ ని కోరారు. ఇంటి సభ్యులు అందరూ దాదాపు శివాజీ కి మద్దతు తెలిపారు.
అందరూ ఏకాభిప్రాయంగా ఆయన కెప్టెన్సీ చూడాలి అంటూ శివాజీ వైపే మొగ్గు చూపారు. అమర్ దీప్ జనం మెచ్చిన వాడే నాయకుడు .. నాకు బాగా నచ్చాడు అంటూ పవర్ ఫుల్ డైలాగ్ కొట్టాడు. ఆ తర్వాత నామినేషన్స్ లో రాజమాతలుగా ఉన్న శోభా శెట్టి, ప్రియాంకలు జెన్యూన్ గా చేశారా అని అశ్విని అడిగారు నాగార్జున. కాగా అశ్విని ‘ వాళ్ళిద్దరూ డామినేట్ చేస్తున్నారు అని చెప్పింది.
ఇక శోభా శెట్టి ‘ లేదు మేము అలా చేయలేదు సార్ అని చెప్పింది. ఏంటి మీరు డామినేట్ చేయడం లేదా అని అడిగారు నాగ్. ఇక ప్రియాంక అయితే ‘ మేం ఏమి అనకుండానే ఆమె ఏడుస్తుంది సార్ అని చెప్పింది. దీంతో నాగార్జున మీరు జెన్యూన్ గా నామినేషన్స్ చేస్తే .. అమర్ దీప్ ని అన్నిసార్లు ఎందుకు సేవ్ చేశారు. మీరు కావాలని పక్షపాతంగా వ్యవహరించారు అంటూ ప్రియాంక, శోభా లను వాయించేశారు నాగార్జున. ఇక వాళ్ళ నోట మాట రాలేదు. కాగా శివాజీ హౌస్ కెప్టెన్ అయినట్లు తెలుస్తుంది.