Telangana Elections 2023 : తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్న శక్తులేవి?

తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్న శక్తులేవి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : November 11, 2023 6:33 pm

Telangana Elections 2023 : నిన్నటితో నామినేషన్ల పర్వం ముగిసింది. అంటే అసలు ఎన్నిక ఇప్పుడే మొదలవుతుంది. నిజానికి ఇదే కరెక్ట్ నిర్ణయం. పార్టీతోపాటు అభ్యర్థులను చూసుకోవాల్సిన అవసరం మీడియా, పార్టీలకు ఉంది. ఇదీ నిజానికి అభ్యర్థులను లాస్ట్ టైంలో మార్చి కొందరికి షాకిచ్చాయి.

తెలంగాణ సమాజాన్ని తప్పుడు చర్చలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాలతోటి తప్పుడు దారి పట్టిస్తున్నారని అనుమానాలున్నాయి. దీనికి సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారు. తీన్మార్ మల్లన్ననే తీసుకుందాం. తీన్మార్ మల్లన్నను జనం ఎంత ఓన్ చేసుకున్నారంటే.. అంతగా తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసిన తీన్మార్ మల్లన్న తాజాగా తన స్వార్థం తాను తీసుకున్నాడు. కాంగ్రెస్ లో చేరి తన భావాలు, తన సిద్ధాంతాలకు గాలికి వదిలి భ్రష్టుపట్టిపోయాడు. రేవంత్ రెడ్డిని ఇంతకన్నా ఎక్కువ తిట్టి.. సీట్లు అమ్ముకుంటున్నాడని తిట్టి ఇప్పుడు అదే పార్టీలో ఎలా చేరుతాడు తీన్మార్ మల్లన్న అని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్ ఎటు వెళ్లిపోతే అటు పోవాలా? సమాజం వీరిని ఫాలో అవ్వాలా? అన్నది ఇక్కడ అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల ప్రజలు ఆలోచిస్తున్నారు.

తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్న శక్తులేవి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.