The Raja Saab: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో వస్తున్న రాజాసాబ్ సినిమా ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు… అందులో నిధి అగర్వాల్ కీలకపాత్ర నటిస్తుండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన సత్తా చాటాల్సిన సమయమైతే ఆసన్నమైంది. కల్కి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన చాలా సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాలో నటిస్తుండడం విశేషం… ఇక ఈ సినిమాలో ప్రభాస్ తన పూర్తిస్థాయి కామెడీని కూడా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు… కాబట్టి ఈ మూవీ తప్పకుండా విజయాన్ని సాధిస్తుందని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె సినిమాలో ప్రభాస్ కి ప్రేమ పేరు చెప్పి మోసం చేస్తుందట…
ఎలాగైనా సరే తన మీద రివెంజ్ తీర్చుకోవాలని చూసిన ప్రభాస్ ఏ రేంజ్ లో రివెంజ్ ప్లాన్ చేశాడు. మొత్తానికైతే తన దిమ్మ తిరిగిపోయేలా రివెంజ్ ను తీర్చుకున్నాడా..? వీటన్నింటిని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక సినిమా రిలీజ్ దగ్గరవుతున్న కొద్ది సినిమా యూనిట్ నుంచి రోజుకొక న్యూస్ అయితే బయటకు వస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది భారీ హైప్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మారుతి మొదటిసారి స్టార్ హీరో లను డైరెక్షన్ చేశాడు. కాబట్టి స్క్రీన్ మీద ప్రభాస్ ని పూర్తి స్థాయిలో వాడుకున్నాడా? లేదా కమర్షియల్ హంగులతో సినిమా మొత్తాన్ని నింపేశాడా? కథపరంగా సినిమా ఎక్కడ కూడా ప్రేక్షకుడిని నిరాశపరచదా?
ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్క్రీన్ మీద క్యారెక్టర్లతో పరుగులు పెట్టిస్తాడా? వీటన్నింటికి క్లారిటీ రావాలంటే ఈ నెల 9వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికైతే మారుతి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం మారుతి దశ తిరిగినట్టే…