Naa Anveshana Anvesh Case: నా అన్వేషణ అనే యూట్యూబ్ చానల్ ద్వారా అన్వేష్ ట్రావెలర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దేశ విదేశాలను తిరుగుతూ ఆ దేశంలో ఉన్న వింతలు విశేషాలను చూపిస్తూ వచ్చాడు. తద్వారా తన మాటలకు అట్రాక్ట్ అయిన జనాలు అతన్ని ఫాలో చేస్తూ అతను పెట్టే కంటెంట్ చూస్తూ వచ్చారు. అయితే ఆయన రీసెంట్ గా హిందూ దేవుళ్లను దూషిస్తూ మాట్లాడిన మాటలు గాని, గరిజపాటి గారిని ఉద్దేశించి వాడిన బూతు పదాలు గానీ, శివాజీని తిట్టిన విషయాల్లో చాలామంది చాలా రకాలుగా స్పందించారు. ముఖ్యంగా హిందూ దేవుళ్లను తిట్టడం పైన హిందూవులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అతని మీద కేసులను ఫైల్ చేశారు… మొత్తానికైతే అన్వేష్ ను విమర్శించని వారు లేరు…
ఇక తనను పట్టుకోడానికి తెలుగు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు దొరక్కకుండా ఉండటానికి అన్వేష్ విదేశాల్లోనే తిరుగుతున్నాడు. ఇప్పటికే తన యూట్యూబ్ ఛానల్ నుంచి ఐదు నుంచి ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్లు తన చానెల్ ను అన్ సబ్స్క్రైబ్ చేయడంతో అన్వేష్ కి చుక్కలు కనిపిస్తున్నాయి.
రీసెంట్గా ఏ జ్యూడ్ అజయ్ ను అన్వేష్ బెదిరిస్తూ పెట్టిన వీడియో ద్వారా అన్వేష్ భారీగా నెగెటివిటిని మూటగట్టుకున్నాడు… అన్వేష్ మీద దాదాపు 30 కేసుల వరకు నమోదు చేశారు. ఇక అన్వేష్ ఇండియాకి రావాలంటే ముందుగా అతని యూట్యూబ్ ఛానల్ ఐడి, ఇన్స్టా ఐడి దొరికితే అది సాధ్యమవుతుందని పోలీసులు దానికోసం తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నారు.
ఏది ఏమైనా కూడా ఇంకో పది రోజుల్లో అన్వేష్ కు సంబంధించిన ఛానల్స్ ఐడిని పట్టుకొని అతన్ని ఇండియాకి రప్పిస్తామని హైదరాబాద్ పోలీసులు చాలా తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అతను కనక ఇండియాకి వస్తే మాత్రం అతను హిందువుల ఆగ్రహానికి గురవ్వడమే కాకుండా అతన్ని వదిలేస్తే హిందువులందరు అతన్ని చితకబడుతారు. అలాంటి వ్యక్తిని పోలీసులు నిజంగానే ఇండియాకి తీసుకొస్తారా లేదంటే ఈ ఇష్యూ సైడ్ ట్రాక్ అయ్యేంత వరకు మేనేజ్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది…