
‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాల డైరెక్టర్ వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్రావు’ అనే బయోపిక్ ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం మొదలైంది. పైగా హీరో పాత్రకు సంబంధం లేని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. అంతలో హీరో రానా సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమాను తీయాలని నిర్ణయించుకున్నప్పటికీ.. సినిమా కూడా మొదలైనప్పటికీ సినిమా నుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా మధ్యలోనే తప్పుకున్నాడు.
అప్పటి నుండి ఇప్పటిదాకా హీరో దొరకట్లేదు అట. ఏ హీరో దగ్గరకు పోయినా దొంగ పాత్ర అనగానే భయపడిపోతున్నారట. సినిమాలో హీరో పాత్ర పక్కా నెగిటివ్ పాత్ర అని మన హీరోలు భావించే సినిమా నుండి తప్పుకుని ఉండొచ్చు. అయితే సినిమాలో దొంగతనం చేసే సన్నివేశాలు చాల బాగుంటాయని.. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్ర తాలూకు సన్నివేశాల్లోనే మంచి ఫన్ ఉంటుందని గజదొంగగా కామెడీ బాగా చేస్తాడట. మరి చివరకి ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి.
కాగా ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్ పురానికి చెందిన ఈ టైగర్ నాగేశ్వరరావు 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఈ బయోపిక్ లో బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.