Skanda Movie: సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు రావాలంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. కానీ కొంతమంది మాత్రం మంచి అవకాశాలను దక్కించుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంటారు అలాంటి వాళ్లలో శ్రీలీల ఒకరు. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన హీరోయిన్ గా చేస్తుంది.ఇక రీసెంట్ గా స్కంద సినిమాలో కూడా రామ్ పక్కన ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ స్కంద సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.ఇక ఇది ఇలా ఉంటె బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం మొదట మరో టాప్ హీరోయిన్ అయిన రష్మిక మందాన ని హీరోయిన్ గా పెట్టాలని అనుకున్నాడట.
కానీ ఆమె కొంచం బిజీగా ఉండటం ఇక అప్పుడే శ్రీలీల నటించిన ధమాకా సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకోవడం తో శ్రీలీల ని ఈ సినిమా లో హీరోయిన్ గా తీసుకున్నాడు…అయితే బోయపాటి తన సినిమాలో హీరోయిన్స్ ని కూడా చాలా బాగా చూపిస్తాడు అందులో భాగంగానే ఈ సినిమా లో శ్రీలీల ని కూడా చాలా బాగా చూపించినట్టుగా తెలుస్తుంది..ఇక బోయపాటి మార్క్ యాక్షన్ తో రామ్ ఈ సినిమాలో మంచి మాస్ హీరో గా కనిపించి తను కూడా మాస్ హీరోగా ఎదిగే ప్రయత్నం అయితే చేశాడు…
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ స్కంద సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది.అయితే ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమా తో మరోసారి అల్లు అర్జున్ కి జోడి గా మన ముందుకు రాబోతుంది.నిజానికి పుష్ప సినిమాతోనే రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది.ఇక దాంతో వరుసగా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది.ఇప్పటికే తమిళం లో కార్తీ తో సర్ధార్, విజయ్ తో వారిసు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరో చేస్తున్న ఎనిమల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక టీజర్ వచ్చింది.
ఇందులో రష్మిక కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది.అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందో సందీప్ ఈ టీజర్ తో ప్రేక్షకుల మైండ్ లోకి సినిమాని ఎక్కించాడు.ఈ సినిమాకి ఎనిమల్ అనే పేరు కరెక్ట్ గా సరిపోయేలా ఉంది అంటూ ఆ టీజర్స్ చూసిన చాలా మంది సినీ మేధావులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.నిజానికి ఈ సినిమా అర్జున్ రెడ్డి కంటే కూడా పెద్ద హిట్ అవ్వబోతుంది అనే విషయం అయితే అందరికి అర్థం అవుతుంది.ఇక ఈ సినిమా కనక మంచి విజయాన్ని అందుకుంటే రష్మిక బాలీవుడ్ లో కూడా టాప్ హీరోయిన్ గా మారే అవకాశం అయితే ఉంది…ఇక ఇప్పటీకే తను నటించిన గుడ్ బై సినిమా రిలీజ్ అయి యావరేజ్ టాక్ ని సొంతం చేస్తుంది…ఇక పుష్ప 2 సినిమా తో ఈ అమ్మడు ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి…