Nani: ఏడాదికి ఒక్కో స్టార్ హీరో నుంచి వచ్చేది ఒక్క సినిమా మాత్రమే. ఇక కొంతమంది స్టార్లు అయితే రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. అయితే ఒక్క
న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఒక సినిమా ప్రొడక్షన్ లో ఉండగానే మరో చిత్రాన్ని లాంచ్ చేస్తుంటాడు. కాబట్టి, నానికి ప్లాప్ అండ్ హిట్ లకు సంబంధించి పెద్దగా ఒత్తిడి లేదు. అదే స్టార్ హీరోలకు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.

ఎక్కువ గ్యాప్ ఇచ్చి ఒక్కో సినిమా చేసే హీరోలు రెమ్యునరేషన్ ను పెద్ద మొత్తంలో తీసుకోకపోతే ఏ మాత్రం గిట్టుబాటు కాదు, మన హీరోలు కూడా ఇదే ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే, స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఏవరేజ్ గా 35 నుంచి 50 కోట్ల మధ్యలో ఉంది. అంత తీసుకునేటప్పుడు సినిమాల ఎంపిక లేటు అవుతుంది. ఎన్నో ఆలోచించి సినిమా సెలెక్ట్ చేసుకోవాలి.
ఈ క్రమంలో పెద్ద హీరోలు ఏడాదికి ఒక సినిమా విడుదల చేస్తే గొప్ప అన్నట్లుగా తయారు అయింది ప్రస్తుత పరిస్థితి. నాని మాత్రం వేగంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అందుకే, ఈ కరోనా టైంలో కూడా తన నుంచి రెండు సినిమాలను రిలీజ్ చేయగలిగాడు. ప్రస్తుతం నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమైంది. డిసెంబర్ 24న ఈ సినిమా విడుదలవుతోంది.
ఇక ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ చేస్తున్నాడు. ఈ చిత్రం దాదాపుగా పూర్తయింది. అందుకే నాని ఫోకస్ అంతా ప్రస్తుతం దసరా పై పడింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. సింగరేణి బ్యాక్ డ్రాప్ లో నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రానుంది ఈ సినిమా.
Also Read: Jr Ntr: రివెంజ్ డ్రామాగా తెరకెక్కనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల మూవీ… షూటింగ్ ఎప్పుడంటే ?
అయితే, ప్రస్తుతం ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని పాత్రకు ఒక ఫ్రెండ్ పాత్ర ఉందట. ఈ పాత్ర చాలా కీలకమట. ప్రస్తుతం ఆ పాత్ర కోసం ఒక పేరున్న హీరోను తీసుకోవాలని మేకర్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నాని స్నేహితుడిగా ఎవరు నటిస్తారో చూడాలి.
Also Read: Naga Chaitanya: విధి విచిత్రం… అప్పుడు జంటగా, నేడు ఒంటరిగా!