Lucky Bhaskar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు పాన్ ఇండియా బాటపడుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకుంటున్న క్రమంలో యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా జపం చేస్తున్నారు. మరి ఇదిలా ఉంటే యంగ్ హీరోలు కూడా ఇప్పుడు రాబోతున్న సినిమాలతో మంచి విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక రీసెంట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకోవడం తోపాటు యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరిని ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగ వంశీ రీసెంట్ గా కొన్ని ఆసక్తికరమైన కామెంట్లైతే చేశాడు. పుష్ప 2 సినిమా క్రియేట్ చేస్తున్న పెను ప్రభంజనాలను చూసి బాలీవుడ్ మొత్తం వణికి పోతుంది అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక దానిని ఖండిస్తూ ‘హన్సల్ మెహతా’ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యాలైతే చేశాడు. నాగ వంశీ కి గర్వం ఎక్కువగా ఉందని ఆయన మాత్రమే ప్రొడ్యూసర్ అని విర్రవీగుతున్నాడని బాలీవుడ్ ను ఉద్దేశించి అలాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని ఆయన కామెంట్స్ అయితే చేశాడు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సందర్భంలోనే హన్సల్ మెహతా మాట్లాడుతూ రీసెంట్ గా నాగ వంశి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా నేను డైరెక్షన్ చేసిన ‘స్కాం 1992’ సిరీస్ ని ఆధారంగా చేసుకుని తీశారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది.
దాంట్లో క్రెడిట్ మాకు కూడా దక్కుతుంది అంటూ ఆయన కొన్ని ఆసక్తికరమైన కామెంట్లైతే చేశాడు. మరి ఏది ఏమైనా కూడా స్కామ్ 1992 సినిమా మాదిరిగానే లక్కీ భాస్కర్ కూడా షేర్ మార్కెట్ల మీద స్కాం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాంట్లో నుంచి కొంత రిఫరెన్స్ అయితే తీసుకున్న మాట వాస్తవమే మరి ఏది ఏమైనా వెంకీ అట్లూరి తీసిన సినిమాలు చాలా సెన్సిబుల్ గా ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలను కూడా తీర్చిదిద్దడంలో ఆయనకు చాలా మంచి గుర్తింపైతే ఉంది.
మరి ఇలాంటి సందర్భంలో వెంకీ అట్లూరి ని ఉద్దేశిస్తూ హన్సల్ మెహతా కొన్ని కామెంట్లు కూడా చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది పాన్ ఇండియా వైడ్ గా దూసుకెళ్తున్న సందర్భంలో బాలీవుడ్ హీరోలకి కొంతవరకు మింగుడు పడడం లేదని విషయమైతే వాస్తవం… అదే విషయాన్ని బహిరంగంగా చెబితే మాత్రం వాళ్లు ఖండిస్తూ ఉండడం విశేషం…