Telugu Film Industry: తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే మన సినిమాలను ఇతర రాష్ట్రాల జనాలు సైతం చూసి ఆదరిస్తున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాని చూడడం అనేది ఒక కలగా మారిపోయింది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే టిక్కెట్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి… ఒక సామాన్యుడు తన కుటుంబంతో వచ్చి సినిమాని చూడాలి అంటే ఈజీగా ఒక 5000 నుంచి 6000 రూపాయలు అయితే ఖర్చు అయిపోతున్నాయి. దానివల్ల ప్రేక్షకులు సినిమా థియేటర్ కి రావడమే మానేశారు. ఓటిటి కి వచ్చిన తర్వాత సినిమాను చూడొచ్చులే అంటూ లైట్ తీసుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే చాలా సినిమాలను ప్రేక్షకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకని మన తెలుగు రాష్ట్రాల్లోనే సినిమాలకు భారీగా టికెట్ రేట్లను పెంచుతున్నారు అనేది ఎవరికి అర్థం కావడం లేదు…
తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చూసుకుంటే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన టికెట్ రేట్స్ రీజనబుల్ గా ఉంటాయి. 150 నుంచి 200 వరకు మాత్రమే ఉంటాయి. కానీ మన దగ్గర 600 నుంచి వెయ్యి రూపాయల పైనే టికెట్ రేటు పెడుతున్నారు. దాంతో ప్రేక్షకులెవరు సినిమా చూడటానికి ముందుకు రావడం లేదు.
ఇక రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాకి తమిళంలో 150 నుంచి 200 రూపాయల టికెట్ రేట్ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 100 నుంచి 400 రూపాయల టిక్కెట్ రేట్లు పెట్టారు… నిజానికి థియేటర్ కి ప్రేక్షకులు రావడం లేదు అంటూ మన హీరోలు దర్శక నిర్మాతలు ఆవేదనను చెందుతున్నారు. కానీ ప్రేక్షకులను థియేటర్ కి రాకుండా చేస్తుంది వాళ్లే అనే విషయాన్ని మాత్రం గమనించడం లేదు…
ఇక ఇప్పటికైనా తేరుకొని సగటు ప్రేక్షకుడికి సినిమా అందుబాటులో ఉండే విధంగా టిక్కెట్ రేట్లను తీసుకొస్తే మంచిది. లేకపోతే మాత్రం సినిమాలను ఆదరించే ప్రేక్షకులు లేక చాలా సినిమా థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయం మీద ఒక క్లారిటికి వస్తే బాగుంటుంది…