
మోస్ట్ డిజైరబుల్ మెన్ హైదరాబాద్ లిస్ట్ లో 2020వ సంవత్సరానికి సంబంధించి ‘విజయ్ దేవరకొండ’కి మొదటి స్థానం దక్కడమే చాల మంది హీరోలకు నచ్చలేదు. పైగా వరుసగా మూడు ఏళ్ళు విజయ్ దేవరకొండ మొదటి స్థానంలో నిలవడం వెనుక, విజయ్ దేవరకొండ పీఆర్వో టీమ్ ఉందని కూడా విజయ్ అంటే గిట్టని వాళ్ళు విమర్శలు చేస్తుంటారు.
అలాంటిది ఇప్పుడు హోల్ ఇండియాకి సంబంధించిన లిస్ట్ లో కూడా విజయ్ దేవరకొండ పేరు ప్రముఖంగా ఉండటంతో, విజయ్ యాంటీ ఫ్యాన్స్ కి అసలు మింగుడు పడటం లేదు. మరి నేషనల్ లెవల్లో విజయ్ దేవరకొండ రెండో స్థానంలో నిలవడం అంటే కచ్చితంగా గ్రేట్. కాబట్టి, విజయ్ దేవరకొండ పీఆర్వో టీమ్ పైరవీలు చేస్తే విజయ్ కి ఆ ప్లేస్ వచ్చేది కాదు.
జాతీయ స్థాయిలో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో 50 మంది ఉన్నారు. ఆ యాభై మంది అందరూ ప్రముఖులే. పైరవీలు చేసే అవకాశం ఉంటే.. విజయ్ కంటే ఎక్కువ చేసే అవకాశం మిగిలిన వాళ్ళకే ఎక్కువ ఉంది. కాబట్టి, టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన నేషనల్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో విజయ్ దేవరకొండకి రెండో స్థానం రావడం వెనుక ఎలాంటి లొసుగులు లేవు.
ఇక ఈ లిస్ట్ లో గతేడాది చనిపోయిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ కి మొదటి స్థానం దక్కడం విశేషం. విజయ్ దేవరకొండకి రెండో స్థానం దక్కింది. మొత్తానికి విజయ్ దేవరకొండ అందగాళ్ళ లిస్ట్ లో ముందున్నాడు కానీ, ప్రస్తుతం రెండేళ్లుగా ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేకపోయాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘లైగర్’ సినిమా హిట్ అయితేనే, విజయ్ క్రేజ్ కంటిన్యూ అవుతుంది. లేదు అంటే క్రేజ్ డ్యామేజ్ అవుతుంది.