Allu Arjun vs Ram Charan assets: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే ఒక తెలియని రెస్పెక్ట్ అందరిలో ఉంటుంది…ఆయన అధిరోహించిన శిఖరాలు అలాంటివి…అందుకే తేలు ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఇక చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీ కి వచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్… ఆయన చేసిన సినిమాలు గొప్ప విజయాలను సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను తాను స్టార్ హీరో గా ఎలివేట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన పెద్ది సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు… ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ సైతం కెరియర్ మొదట్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ ల పేర్లు చెప్పుకుంటూ ఇండస్ట్రీలో సక్సెసులనైతే సంపాదించుకున్నాడు. ఇక ఎప్పుడైతే ఆయనకు స్టార్ డమ్ చ్చిందో అప్పటినుంచి మెగా ఫ్యామిలీని పక్కన పెట్టి అల్లు ఫ్యామిలీ అంటూ తన ఫ్యామిలీని తెరమీదకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు.
ఇక గత సంవత్సరం ‘పుష్ప 2’ సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించి 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. ఇప్పటి వరకు సౌత్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా అంత మొత్తంలో వసూళ్లను రాబట్టలేదు. ఈ మూవీ ఆ ఘనత సాధించడం విశేషం…ప్రస్తుతం రామ్ చరణ్ – అల్లు అర్జున్ మధ్య విపరీతమైన పోటీ ఉంది.
వీళ్ళిద్దరూ సినిమాలతోనే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా ఎవరు ఎక్కువ ఆస్తులను సంపాదించారనే విషయంలో కూడా పోటీపడుతున్నట్టుగా తెలుస్తోంది. రన్ చరణ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరి లో ఎవరికి ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి అనే విషయం మీద కొన్ని రోజుల నుంచి తీవ్రమైన చర్చలైతే జరుగుతున్నాయి. నిజానికి రామ్ చరణ్ సినిమాలు, బిజినెస్ ల ద్వారా దాదాపు 5000 కోట్ల వరకు ఆస్తులు సంపాదించాడు.
ఇక అల్లు అర్జున్ సైతం దాదాపు 4000 కోట్ల వరకు తన ఆస్తులు సంపాదించుకున్నట్టుగా తెలుస్తోంది. వీళ్లిద్దరిలో రామ్ చరణ్ ప్రస్తుతానికైతే ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫ్యూచర్లో వీళ్ళ సినిమాలు భారీ సక్సెస్ లను సాధించి నెంబర్ వన్ పొజిషన్ ను ఎవరైతే కైవసం చేసుకుంటారో వాళ్ల ఆస్తులు మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే బిజినెస్ ల రూపంలో కూడా వీళ్లకు భారీగా ఆదాయం వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…