Donald Trump on Xi Jinping: రెండోసారి అమెరికాకు అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఆయన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచ దేశాల మీద టారిఫ్ లు విధిస్తూ పైశాచికాన్ని పొందుతున్నారు. దీనివల్ల ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులు మారిపోతున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా గిట్టని దేశాల మీద దాడులు చేయడానికి ఆయన ఏ మాత్రం వెనుకాడడం లేదు.
ఇటీవల కాలంలో భారత్ మీద ట్రంప్ అనేక సందర్భాలలో విషం కక్కారు.. సుంకాలు విధించారు.. వాటిని అంతకంతకు పెంచుకుంటూ పోయారు. అంతేకాదు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదని డిమాండ్లు కూడా విధించారు. మన దేశానికి సంబంధించిన అనేక విషయాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ.. భారత్ అలా చేసి ఉండకూడదని సొంత భాష్యాన్ని చెబుతున్నారు. తాజాగా ట్రంప్ ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో అమెరికా మంత్రివర్గంలోని కీలక నేతలు.. వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ కూడా పాల్గొన్నారు. సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో ట్రంప్ చైనా ప్రస్తావన తీసుకొచ్చారు.
తాను గతంలో ఒక సమావేశంలో చైనా ప్రతినిధులతో పాల్గొన్నానని.. ఆ సమావేశానికి చైనా అధ్యక్షుడు కూడా హాజరయ్యారని.. తాను మాట్లాడుతూ ఉంటే వారంతా అటెన్షన్ గా ఉన్నారని.. కానీ అమెరికా ప్రతినిధులు మాత్రం అలా ఉండడం లేదని.. తాను ఇక నుంచి మాట్లాడుతుంటే అందరూ అటెన్షన్ గా ఉండాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలా ఉన్నప్పుడే తనమీద భయం ఉంటుందని.. ఆ భయం తనకు కావాలని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంపు మాట్లాడుతున్నంతసేపు అమెరికా ప్రతినిధులు కొంతమంది నవ్వుతుంటే.. ఇంకొంతమంది చప్పట్లు కొట్టారు.. అయితే ఈ వీడియో సోషల్ మీడియా లో విపరీతంగా సర్కులేట్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ అలా కోరుకోవడం తప్పులేదని.. ఎందుకంటే అతడి మనస్తత్వం అలాంటిది అని పేర్కొంటున్నారు. ఇలాంటి ఆలోచనలు ఒక దేశ అధినేతకు ఏమాత్రం సరికావని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
⚡ Trump: “I want my Cabinet to be like Xi Jinping’s. I want them sitting up like that, nice and straight! I’ve never seen men so scared in their lives.”
“JD doesn’t behave like that. He budges into conversations!” pic.twitter.com/RMWwAetNnm
— OSINT Updates (@OsintUpdates) November 5, 2025