Bandi Sanjay: తెలంగాణ బీజేపీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారించి. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు పలు రాష్ట్రాల్లోని అధ్యక్షులను మార్చారు. అయితే మిగతా రాష్ట్రాల్లో కంటే తెలంగాణ లో జరుగుతున్న రాజకీయా పరిణామాలు ఆసక్తిని పెంచాయి. ఎందుకంటే ఒకప్పుడు మూడో ప్లేసులో కూడా కనిపించని బీజేపీకి ఇప్పుడు అదికార పార్టీని ఢీకొట్టేస్థాయికి ఎదిగింది. దాదాపు అధికారం అంచుల వరకు వెళ్లే స్థాయికి వచ్చింది. గ్రామాల్లోనూ బీజేపీ జెండా ఎగురుతుందంటే అందుకు కారణం ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నే అనే వాదన ఉంది. అయితే ఒక్కసారిగా.. అదీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ ని తప్పించడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. బండి సంజయ్ మార్పుతో బీజేపీలోనే కాకుండా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ లల్లోనూ నాయకుల చర్చలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తనను పక్కనబెట్టడంపై తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది.
ఓ వైపు అధ్యక్ష పార్టీ నుంచి తనను తప్పిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ కి ఒక్కసారిగా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో సీన్ తనకు ముందే అర్థమైంది. ఈ నేపథ్యంలో ఆయన ఉపాధ్యక్షుడు జి. మనోహర్ రెడ్డి,కోశాధికారి శాంతికుమారిలతో కలిసి ఫ్లైట్ ఎక్కాడు. ముందుగా ప్రధాన కార్యదర్శితో సమావేశం అయిన తరువాత పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో బండి సంజయ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ పార్టీ అవసరాల నేపథ్యంలో అధ్యక్షుడి మార్పు ఉంటుందని చెప్పారు. ఇలా రెండు గంటల పాటు నడ్డాతో సమావేశం అయిన బండి సంజయ్ విలేకరుల ముందుకు రాకుండా వెనక నుంచి కారులో వెళ్లిపోయారు.
ఆ తరువాత ఎక్కడా మీడియా సమావేశం నిర్వహించలేదు. అయితే ట్విట్టర్లో మాత్రం తన ఆవేదనను వ్యక్తం చేశారు. సమాన్య కార్యకర్తగా ఉన్న నన్ను అధ్యక్షుడిగా చేసిన నరేంద్ర మోదీ, పార్టీ నేతలకు ధన్యవాధాలు తెలిపారు. ఇన్నాళ్లు తనతో కలిసి ఎంతో మంది పోరాడారని, వారిని బాధపెట్టి ఉంటే క్షమించాలని అన్నారు. దీంతో ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన తనను ఎన్నికల సమయంలో తప్పించడంపై తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే కొత్తగా నియమితులైన కిషన్ రెడ్డికి, ఈటల రాజేందర్ కు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వంతో ఉత్సాహంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు.
ఇక బండి సంజయ్ కి పగ్గాలు తీసేయడంతో ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీకి చెందిన విజయశాంతి బండిని ఈ సమయంలో తప్పించడం అన్యాయం అని అన్నారు. కానీ పార్టీ అభివృద్ధి కోసం తాను పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఇలా తెలంగాణ అధ్యక్షుడిగా నిన్నటి వరకు చురుగ్గా ఉన్న బండి సంజయ్ ఒక్కసారిగా మనస్థాపానికి గురికావడంతో ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.