Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమా తోనే ప్రేక్షకులను అలరించాడు. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజకుమారుడు’ సినిమాతో మహేష్ బాబు చాలా డీసెంట్ పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చాడు. ఇక ఆ సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపైతే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ఆయనకు ఆశించిన మేరకు విజయాన్ని సాధించి పెట్టినప్పటికి మురారి, ఒక్కడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో వరుసగా సూపర్ సక్సెస్ లను సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాశాడు… ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులందరిని అలరించి తన అభిమానులుగా మార్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన గురించిన ఒక విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది…
మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాల్లో దాదాపు డూప్ లేకుండానే చేస్తారట. భారీ రిస్కీ షాట్స్ అయితే తప్ప ఆయన డూప్ లను ఎక్కువగా వాడాడని చాలామంది దర్శకులు, యాక్షన్ కొరియోగ్రాఫర్లు తెలియజేస్తుండడం విశేషం… ఇక వన్ నేనొక్కడినే సినిమా విషయంలో ఆయన చాలావరకు డూప్ లేకుండానే బిల్డింగ్స్ మీద నుంచి జంప్స్ చేయడం లాంటివి చేశారట.
అలాగే సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో కూడా ఆయన ఎక్కడా డూప్ ను వాడకుండానే తనే ఓన్ గా స్టంట్స్ చేయడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబుకు ఈ విషయంలో ఎవరు పోటీ రారు అంటూ అతని అభిమానులు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు డూప్ లను వాడుతున్న క్రమంలో మహేష్ బాబు ఒక్కడే డూప్ ని వాడకుండా రిస్క్ షాట్స్ చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉండటం విశేషం…ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలో ఆయన ఎక్కువగా డూప్ ను యూజ్ చేయడం లేదంట. ఇక ప్రస్తుతం ఆయన మీద యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న రాజమౌళి ఇవి మహేష్ బాబు కెరీర్ లోనే గొప్ప గుర్తింపును సంపాదించుకునే సన్నివేశాలు అవుతాయని ఆయన చెబుతూ ఉండటం విశేషం…