Bellamkonda Sai Sreenivas Kishkindapuri: చాలా సంవత్సరాల నుంచి హీరోగా వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు బెల్లంకొండ శ్రీనివాస్…వివి వినాయక్ డైరెక్షన్ లో అల్లుడు శ్రీను అనే సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇక అప్పటి నుంచి వరుసగా మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… అయితే ఆయన చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఆయన చాలావరకు వెనుకబడిపోతున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ‘కిష్కిందపురి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి టాక్ ని సంపాదించుకున్నప్పటికి మిరాయి సినిమాతో పాటు రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమాకి రావాల్సిన అంత గుర్తింపు అయితే రావడం లేదనేది వాస్తవం…
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అవుతుందని బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు…అయితే ఈ మూవీ మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికి కలెక్షన్స్ విషయంలో మాత్రం చాలా వరకు వెనుకబడిపోతున్నాడనే చెప్పాలి. మరి ఇలాంటి సినిమాను గత నెలలో రిలీజ్ చేసిన అయిపోయేది, లేదంటే నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసిన బాగుండేది.
అనుకోకుండా మిరాయి సినిమాకి పోటీగా రావడం వల్ల ఈ సినిమాను చూసేవాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. అందరు మిరాయి సినిమా మీదనే ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాని పట్టించుకునే నాధుడు లేకపోవడంతో బెల్లంకొండ శ్రీనివాస్ సైతం ఈ విషయం మీద కొంతవరకు ఆవేదన ను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా అందరూ చూడండి అంటూ ఈ మూవీని సైతం ఆయన ప్రమోట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన సమయంలో రిలీజ్ చేయడం అనేది అంతకంటే ముఖ్యం… కాబట్టి సరైన సమయంలో సినిమాలు రిలీజ్ చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…