https://oktelugu.com/

NTR: ఎన్టీఆర్ లైఫ్ లో ఆ ఇద్దరి గ్రేట్ మహిళలు ఎవరు?

ఎన్టీఆర్ మనవడిగా జూ. ఎన్టీఆర్ గా టాలీవుడ్ కు పరిచయమై వరుస హిట్లను సొంతం చేసుకుంటున్నారు తారక్. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కొన్నా వాటిని అధిగమించి ముందడుగు వేస్తూ నేడు టాప్ హీరో రేంజ్ ను సంపాదించారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 8, 2024 / 12:37 PM IST

    NTR

    Follow us on

    NTR: యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అంచనాలకు మించి సక్సెస్ ను సాధించారు. టాలీవుడ్ స్టార్ కాస్త గ్లోబల్ స్టార్ అయ్యేసరికి ఈయనకు అభిమానులు అమాంతం పెరిగిపోయారు. సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు.. ప్రోత్సాహం కూడా ఉండాల్సిందే. అయితే ఈ విషయంలో తాను చాలా లక్కీ అంటారు ఎన్టీఆర్. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా?

    సీ. ఎన్టీఆర్ మనవడిగా జూ. ఎన్టీఆర్ గా టాలీవుడ్ కు పరిచయమై వరుస హిట్లను సొంతం చేసుకుంటున్నారు తారక్. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కొన్నా వాటిని అధిగమించి ముందడుగు వేస్తూ నేడు టాప్ హీరో రేంజ్ ను సంపాదించారు. అయితే ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా రాణించడంలో ఇద్దరు మహిళల పాత్ర కీలకంగా ఉంటుందని తెలిపారు ఎన్టీఆర్. దీనికి కారణం ఒకరు అమ్మ అయితే మరొకరు భార్య అని తెలిపారు.

    ప్రతి కథ వైవిధ్యంతో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న తారక్ అమ్మ ద్వారా తనకు ఈ ఆ క్రియేటివిటీ వచ్చిందట. అమ్మ బాల్యం నుంచి ప్రోత్సహించిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అమ్మకు ఇష్ట ప్రకారమే డాన్స్ నేర్చుకున్నాడట. అమ్మ వల్లనే ఈ ప్రపంచం ఆయనను డాన్సర్ గా గుర్తించింది తెలిపారు తారక్. మన ఆలోచనలను, భావాలను ఎక్స్ ప్రెస్ చేయడానికి డ్యాన్స్ ఒక మార్గం అని నేను ఫీల్ అవుతున్నా అంటూ వెల్లడించారు ఎన్టీఆర్. ఇక హోమ్లీ మ్యాన్ గా మార్చిన ఘనత మాత్రం తన భార్యది అంటూ చెప్పుకొచ్చారు తారక్.

    ప్రణతి తన ఇష్టాలను తనపై రుద్దాలని ఎప్పుడు అనుకోదట. ఒక్క రోజు కూడా నేను వ్యాయామం మానకుండా తను ప్రోత్సహిస్తుందని తెలిపారు. లక్ష్మీ ప్రణతికి కొత్త సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టమట. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న తారక్ దసరా కానుకగా ఈ సినిమాను కచ్చితంగా రిలీజ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.